యంగ్ హీరో నితిన్ రాశిఖన్నా ల కాంబినేషనల్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శ్రీనివాస కళ్యాణం రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని రెగ్యులర్ ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పర్వాలేదనిపించే విధంగా ముగించింది.
ఓవరాల్ గా 9.78 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వర్కింగ్ డే అయిన 5 వ రోజున పెద్దగా జోరు చూపలేక పోయింది. టోటల్ గా 40 లక్షల షేర్ ని రెండు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 50 లక్షల షేర్ ని సాధించింది ఈ సినిమా…దాంతో మొత్తం మీద 5 రోజుల్లో…
10.28 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 27 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే ఇది దాదాపు అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు.