Home న్యూస్ శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ….హిట్టా-ఫట్టా!

శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

కెరీర్ లో చాలా కాలంగా ఓ మంచి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు మాస్ టచ్ ఉన్న కథలను కూడా చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ మందుకు పలాస డైరెక్టర్ తో కలిసి శ్రీదేవి సోడా సెంటర్ మూవీ తో మంచి అంచనాలనే క్రియేట్ చేశాడు సుధీర్ బాబు. మరి నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా తో ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… సినిమా ఓపెన్ అవ్వడం హీరో జైలుకి వెళ్ళడంతో మొదలు అవ్వగా తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఊరిలో ఫేమస్ లైట్ మాన్ అయిన హీరో కి అలాగే ఊరిలో సోడా సెంటర్ ఫేమస్ అయిన హీరోయిన్ కి పరిచయం తర్వాత ప్రేమ మొదలు అవుతుంది కానీ…

కాస్ట్ వేరని హీరోయిన్ ఫాదర్ నో చెప్పడం హీరో లైఫ్ లో ఓ విలన్ ఎంటర్ అవ్వడం ఆ విలన్ హీరోయిన్ లైఫ్ లో కూడా ఎంటర్ అవ్వడం తర్వాత ఏం జరిగింది.. హీరో హీరోయిన్స్ ఏకం అయ్యారా లేదా, హీరో జైలు కి వెళ్ళడానికి కారణం ఎవరు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

పెర్ఫార్మెన్స్ పరంగా సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ రోల్ ఇదే నని చెప్పొచ్చు. అటు నటన పరంగా మరింత మెరుగు అవ్వగా ఇటు సినిమా కోసం భారీగా కష్టపడ్డాడు, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు, రగ్గుడ్ టచ్ తో మెప్పించాడు… మొత్తంగా సినిమా తన కెరీర్ కి స్ట్రాంగ్ బూస్టప్ ఇవ్వడం ఖాయం, ఇక హీరోయిన్ ఆనంది కూడా అద్బుతంగా నటించి మెప్పించింది. తనకి కొన్ని అల్టిమేట్ సీన్స్ కూడా పడ్డాయి.

ఇక విలన్ కూడా అద్బుతంగా నటించి మెప్పించగా నరేష్, సత్యం రాజేష్ లు మెప్పించగా మిగిలిన రోల్స్ కూడా పర్వాలేదు అనిపించారు, సంగీతం ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫైట్ సీన్స్ కి సాలిడ్ రెస్పాన్స్ ఉంటుంది.. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి. డైలాగ్స్ కొన్ని చాలా రాశారు, సినిమాటోగ్రఫీ బాగుంది, విలేజ్ వాతావరణం, బోట్ ఫైట్, జాతర ఫైట్ బాగా తీశారు.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మొదటి సినిమా పలాసా మాదిరిగానే మరోసారి కాస్ట్ ని ఇంటర్ లింక్ చేస్తూ రాసుకున్న ఈ విలేజ్ లవ్ స్టొరీ కథ పరంగా కొత్తదనం ఏమి లేదు కానీ రొటీన్ గానే అనిపిస్తూ సాగినా సీన్ బై సీన్ ఫస్టాఫ్ వరకు బాగానే మెప్పించింది. ఇక సెకెండ్ ఆఫ్ ఇంకా బెటర్ గా ఉంటుంది అనుకున్నా…

కథ ఎక్కువగా డ్రాగ్ చేసినట్లు అనిపించడం, కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది కానీ ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకుని ఊహకందని ట్విస్ట్ తో ఓ షాకింగ్ టర్న్ తీసుకుంటుంది… ఆ షాకింగ్ ఎలిమెంట్ చుట్టూ ఓవరాల్ కథని బాగానే రాసుకున్నారు అనిపిస్తుంది…. ఆ ట్విస్ట్ ను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టంట్ అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే, సుధీర్ బాబు, ఆనంది పెర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అని చెప్పాలి, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టొరీ పాయింట్, రన్ టైం ఎక్కువ అవ్వడం, సెకెండ్ ఆఫ్ స్లో డౌన్ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి.

అయినా కానీ సినిమా చాలా వరకు రొటీన్ గా సాగినా ఎక్కడా అంచనాలను తగ్గించలేదు… అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత అప్పటి వరకు సినిమా పై ఉన్న ఇంప్రెషన్ మారిపోతుంది…. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు సినిమా చాలా వరకు ఆకట్టుకుంది అని చెప్పాలి. ఫైనల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here