Home న్యూస్ బాలీవుడ్ లో చిన్న సినిమా జోరు….మంచి రివ్యూలు…వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్!

బాలీవుడ్ లో చిన్న సినిమా జోరు….మంచి రివ్యూలు…వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఎట్టకేలకు ఈ వీకెండ్ లో ఓ డీసెంట్ మూవీ వచ్చింది….ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ తో మంచి జోరు చూపించే రాజ్ కుమార్ రావ్(Rajkummar Rao) నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకాంత్(Srikanth Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలతో దూసుకు పోతుంది.

రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు గడ్డ మీద పుట్టి అంధుడు అయినా ఉన్నత శిఖరాలు అధిరోహించిన శ్రీకాంత్ బొల్ల లైఫ్ స్టోరీగా వచ్చింది….సైన్స్ అంటే ఇష్టం ఉన్నా అంధుడు అవ్వడంతో చదువు విషయంలో అనేక అవరోధాలను ఫేస్ చేసిన శ్రీకాంత్ ఎలా తను అనుకున్నది లైఫ్ లో సాధించాడు అన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా…

ట్రైలర్ తోనే డీసెంట్ క్రేజ్ ను హిందీలో సొంతం చేసుకోగా రాజ్ కుమార్ రావ్ రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేక పోయినా కూడా ఈ సినిమా డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు వీకెండ్ లో 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. 4వ రోజు వర్కింగ్ డే లో కూడా మొదటి రోజు లెవల్ లో…

2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది అంటున్న ఈ సినిమా లాంగ్ రన్ ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది, హృదయానికి హత్తుకునే మంచి స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అవ్వడంతో సీట్ ఎడ్జ్ లో కూర్చుని ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీ ని మనవాళ్ళు గుర్తించకపోవడం విచారకం అనే చెప్పాలి. కానీ బాలీవుడ్ లో సినిమాకి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తూ ఉండటం నటుడిగా రాజ్ కుమార్ రావ్ కి ఈ సినిమా ద్వారా అవార్డులు రావడం ఖాయమని చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here