Home గాసిప్స్ ఇప్పటి వరకు చేయని జక్కన్న ఇప్పుడు చేస్తున్నాడు…..ఆ 2 హీరోల ఫ్యాన్స్ వెయిటింగ్!!

ఇప్పటి వరకు చేయని జక్కన్న ఇప్పుడు చేస్తున్నాడు…..ఆ 2 హీరోల ఫ్యాన్స్ వెయిటింగ్!!

0

     లాక్ డౌన్ వలన అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మరికొంత కాలం కూడా ఇళ్లలోనే గడపాల్సిన అవసరం కూడా ఉందని అనిపిస్తుంది. ఇలాంటి టైం లో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తమ తర్వాత సినిమాల విషయాలు కానీ, కథలు కానీ ప్రజెంట్ సినిమాల వర్క్ కూడా సాద్యం అయినంత వరకు ఇళ్ళనుండే జరిగేలా ప్రణాలికలు రూపొందిస్తున్నారు. ఇక టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి కూడా…

తన కెరీర్ లో మొదటి సారి ఒకే సమయంలో ఇటు తన ప్రజెంట్ సినిమా గురించి అలాగే తన ఫ్యూచర్ మూవీ గురించి కూడా ఎక్కువ ఖాళీ సమయం దొరకడం తో ఆలోచిస్తూ లాక్ డౌన్ లో బోర్ కొట్టకుండా చూసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ తో…

తన అప్ కమింగ్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు జక్కన్నా… దాంతో ఈ లాక్ డౌన్ లో ఆ సినిమా కోసం కథ ని సిద్ధం చేసే పనిలో ఉన్న జక్కన్నా మరో పక్కా ప్రస్తుత సినిమా ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ అప్ డేట్ పనిలో కూడా బిజీ గా ఉన్నాడని తెలుస్తుంది.

రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజున చరణ్ క్యారక్టర్ ఇంట్రో ఇచ్చిన జక్కన్న ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ చేయాల్సిన ఇంట్రో టీసర్ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. స్పెషల్ గా షూట్ చేసేలా ప్రస్తుత పరిస్థితులు లేవు కాబట్టి…

సినిమాలో ఫుటేజ్ నే వాడుకుని డానికి కీరవాణి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చేలా ప్రణాలికలు చేస్తున్నాడట. దాంతో ఇటు ఆర్ ఆర్ ఆర్ న్యూ టీసర్ అటు మహేష్ తో చేయబోయే సినిమా కథ ని ప్రిపేర్ చేయడం లో బిజీ అయ్యాడు జక్కన్నా… ఈ న్యూస్ తో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీసర్ అండ్ లుక్ కోసం అటు మహేష్ ఫ్యాన్స్ జక్కన్న మహేష్ ల సినిమా కోసం ఫుల్ ఈగర్ గా వైట్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here