యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా రూపొందిన సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్… బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పోటి లో రిలీజ్ అయిన మూవీ కాగా సినిమాకి మిగిలిన సినిమాలతో పోల్చితే మంచి టాక్ లభించడం తో స్టార్ట్ స్లో గా ఉన్నా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో స్టడీ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…
తర్వాత కొత్త సినిమాల కారణంగా పరుగును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది, సినిమాకి కలెక్షన్స్ బాగా ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమాల కారణంగా ఆల్ మోస్ట్ 80% థియేటర్స్ ని ఆ సినిమాలకే ఇచ్చేశారు, దాంతో ఈ సినిమా పరుగు పై అది భారీగా ఇంపాక్ట్ చూపింది.
కొత్త సినిమాల్లో కొన్ని టాక్ బాలేకున్నా కానీ అగ్రిమెంట్స్ వలన ఈ సినిమాకు తిరిగి థియేటర్స్ ని పెంచలేదు, దాంతో అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా.
మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.09Cr
👉Ceeded: 37L
👉UA: 55L
👉East: 38L
👉West: 27L
👉Guntur: 34L
👉Krishna: 35L
👉Nellore: 23L
AP-TG Total:- 3.58CR (6.39Cr Gross~)
Ka+ROI: 12L
Os – 12L
Total WW: 3.82Cr(6.70cr Gross~)
సినిమాను టోటల్ గా 4.6 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.
కానీ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బ్రేక్ ఈవెన్ ని అందుకొక పోయినా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 78% రికవరీ ని సొంతం చేసుకోవడం తో సినిమా యావరేజ్ గా పరుగును ముగించాల్సి వచ్చింది, మార్చ్ మొదటి వారం లో కాకుండా మార్చ్ 19 వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా సినిమాకి బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది అని చెప్పొచ్చు.అలా కాకుండా చాలినన్ని థియేటర్స్ ని ఉంచినా సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ జాబితా లో ఉండేది.