కమెడియన్ నుండి హీరోగా మారి వరుస పెట్టి సినిమాలను చేసిన యాక్టర్ సునీల్ కొన్ని సక్సెస్ లు సొంతం చేసుకున్నా కానీ ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించడం తో తీవ్రంగా దెబ్బతిన్నాడు. హీరో గా మాత్రమె అయితే కష్టమే అని గమనించిన సునీల్ తర్వాత మళ్ళీ సైడ్ రోల్స్ కూడా చేయడం మొదలు పెట్టగా వాటి లో కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు కూడా పడగా….
రీసెంట్ గా తను ముఖ్య పాత్ర పోషించిన మర్డర్ మిస్టరీ మూవీ కనపడుటలేదు అనే సినిమా భారీ పోటి లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సునీల్ రోల్ ఆల్ మోస్ట్ సగం అయ్యాక వచ్చినా అప్పటి వరకు బోర్ కొట్టిన సినిమా సునీల్ ఎంట్రీ తో కొంచం బెటర్ గా అనిపిస్తుంది…
అయినా కానీ జనాలు ఈ సినిమాను చూడటానికి థియేటర్స్ కి రాలేదు… సినిమాను మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు… కాగా సినిమా మొదటి 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 18 లక్షల దాకా గ్రాస్ ను 10 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా…
పరుగు కంప్లీట్ అయ్యే టైం కి మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు స్టేట్స్ లో 28 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని టోటల్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 17 లక్షల వరకు షేర్ ని అందుకుని ఉంటుంది… ఇవి కూడా డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ తీయకుండా చెబుతున్న…
కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే ఇక సినిమా కి షేర్ ఏమి మిగలదు అని చెప్పాలి. సినిమా ను మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించగా సినిమా మొత్తం మీద బిజినెస్ ఏమి లేకుండా ఓన్ రిలీజ్ అవ్వగా బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మట్టుకు తీవ్రంగా నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని పరుగును ముగించింది అని చెప్పాలి.