Home న్యూస్ సూర్య బందోబస్త్ తమిళ్-తెలుగు బిజినెస్…అక్కడ అంత తక్కువేంటి సామి!!

సూర్య బందోబస్త్ తమిళ్-తెలుగు బిజినెస్…అక్కడ అంత తక్కువేంటి సామి!!

0

     తమిళ్ హీరోలలో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సూపర్బ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో సూర్య… గజినీ, యముడు సిరీస్ తో ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సూర్య కి ఈ మధ్య కాలం లో నికార్సయిన హిట్ లేక పోవడం తో మార్కెట్ మెల్లి మెల్లిగా కోల్పోతూ వస్తున్నాడు. రీసెంట్ టైం లో సూర్య సినిమాలకు ఓపెనింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో రావడం లేదు.

దాంతో బిజినెస్ వాల్యూ మరింత తగ్గిపోయింది. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ NGK భారీ డిసాస్టర్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్ సూర్య నటించిన మరో కొత్త సినిమా బందోబస్త్ పై గట్టిగా పడింది. సినిమా అటు తమిళ్ లో ఇటు తెలుగు లో సాధించిన బిజినెస్ సూర్య నటించిన…

ఇతర సినిమాలతో పోల్చితే తక్కువ గానే ఉందని చెప్పాలి. తమిళ్ వర్షన్ టోటల్ గా సాధించిన బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి..
Tamil Version:
?Tamilnadu- 26Cr
?Kerala- 3Cr
?Karnataka- 3Cr
?Overseas- 12.5Cr
Total :- 44.5Cr(Break Even – 85Cr Gross) సినిమా తమిళ్ వర్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే టోటల్ గా 85 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేయాలి.

ఇక తెలుగు వర్షన్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో 9 కోట్లకు పలికింది. తెలుగు వరకు పర్వాలేదు కానీ తమిళ్ లో ఇది వరకు రిలీజ్ అయిన NGK బిజినెస్ 45 కోట్లకు పైగా పలకగా ఇప్పుడు ఆల్ మోస్ట్ సగం తగ్గి షాక్ ఇచ్చింది. బహుశా ఆ సినిమా నష్టాలను…

పూడ్చడానికి ఈ సినిమా బిజినెస్ ని తగ్గించి ఉంటారు అన్న టాక్ ఉంది. మొత్తం మీద సినిమా తెలుగు తమిళ్ కలిపి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here