కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఏకంగా 300 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ తో కోలివుడ్ తరుపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి దుమ్ము లేపగా సినిమా విజయ్…
డబుల్ రోల్ లో మెప్పించిన విషయం తెలిసిందే. రాయప్పన్ మరియు మైకల్ రెండు రోల్స్ లో విజయ్ నటన అద్బుతంగా ఉందని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత కూడా రాయప్పన్ రోల్ మనతోనే ఉండేంత హార్ట్ టచింగ్ గా రూపొందించారు. అలాంటి రోల్ ని ముందు విజయ్ కోసం అనుకోలేదన్న విషయం తక్కువ మందికే తెలుసు.
ఈ విషయాన్ని సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అర్చన రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారట. సినిమాలో రాయప్పన్ రోల్ కి ముందు సీనియర్ నటులను అనుకున్నామని, కానీ ఆ టైం లో ముంబై కి చెందిన తన ఫ్రెండ్స్ తో ఇలాంటి తండ్రి కొడుకుల నేపధ్యంలో…
లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దంగల్ డైరెక్టర్ నితేష్ తివారీ చిచోరే అనే సినిమా చేస్తున్నారని, అందులో రెండు రోల్స్ సుశాంత్ చేస్తున్నాడని ఆ గెటప్స్ చూపించారట. ఆ గెటప్స్ చూసి మాకు కూడా విజయ్ తోనే రెండు గెటప్స్ వేయిస్తే మరింత హైలెట్ అవుతుందని, రాయప్పన్ రోల్ ని విజయ్ తోనే చేయించామని… విజయ్ మా అంచనాలను మించి…
ఆ రోల్ లో రెచ్చిపోయాడని అందుకే సినిమా అంతలా విజయాన్ని సొంతం చేసుకుందని తెలియజేసింది అర్చన. బాక్స్ ఆఫీస్ దగ్గర లేట్ సుశాత్ చిచోరే కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా బిగిల్ విజయ్ కెరీర్ నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ మాస్టర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని సమాచారం..