బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన సినిమా స్వాతి ముత్యం దసరా సెలవుల్లో మిగిలిన పెద్ద సినిమాతో పోటీ పడటానికి కూడా సిద్ధం అయ్యి తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి ముందు రోజు కూడా స్పెషల్ షోలను వేయడం టీం కాన్ఫిడెన్స్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక పోటిలో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్న స్వాతిముత్యం సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసు కుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే… హీరోకి పెళ్లి సంబందాల చూస్తున్న హీరో తండ్రి రావ్ రమేష్ వర్ష బొల్లమ్మతో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా హీరో హీరోయిన్స్ ఇష్టపడటం పెళ్లికి సిద్ధం అవ్వడం జరుగుతుంది, పెళ్లి టైం లో అనుకోకుండా ఓ అమ్మాయి ఓ బిడ్డతో వచ్చి హీరోనే ఆ బిడ్డకి తండ్రి అని చెప్పడంతో కథ టర్న్ అవుతుంది….. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా మిగిలిన కథ…
పెర్ఫార్మెన్స్ పరంగా మొదటి సినిమానే అయినా బెల్లంకొండ గణేష్ ఉన్నంతలో బాగా పెర్ఫార్మ్ చేయగా తనకి ప్యాడప్ గా భారీ స్టార్ కాస్ట్ బాగా సపోర్ట్ చేశారు. నటన పరంగా గణేష్ బాగానే నటించాడు… హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా మెప్పించగా మిగిలిన స్టార్ పెద్దదిగానే ఉండగా అందరూ అద్బుతంగా నటించి మెప్పించారు…
సంగీతం బాగుండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం రొటీన్ గానే ఉన్నా సెకెండ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్కౌట్ అయింది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కొత్త డైరెక్టర్ రొటీన్ కథనే చాలా బాగా చెప్పాడు, కథ కోర్ పాయింట్ విక్కీ డోనర్ ని పోలినా కానీ చాలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్…
ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడా మిస్ చేయకుండా చూసుకున్న డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ లో సీనియర్ యాక్టర్స్ తో ఎక్స్ లెంట్ కామెడీని వర్కౌట్ అయ్యేలా చేశాడు… అదే సినిమాకి బాగా కలిసి వచ్చి సినిమా బాగా ఇంప్రెస్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ఓ మంచి ఎంటర్ టైనర్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం. సినిమా మా రేటింగ్ 3 స్టార్స్…