Home న్యూస్ స్వాతిముత్యం కలెక్షన్స్ పరిస్థితి ఏంటి…ఇప్పటి వరకు ఎంత వచ్చాయంటే!!

స్వాతిముత్యం కలెక్షన్స్ పరిస్థితి ఏంటి…ఇప్పటి వరకు ఎంత వచ్చాయంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా కి రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమా స్వాతి ముత్యం కూడా ఒకటి, మిగిలిన సినిమాలు గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్ లతో పోల్చితే కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ పండగ టైం లో జనాలు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు అనే చెప్పాలి…

మొదటి రోజు అతి కష్టం మీద సినిమాకి షోలు దక్కగా అక్కడ నుండి వచ్చిన కలెక్షన్స్ కూడా తక్కువే, ఇక రెండో రోజు అయినా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుంది అనుకున్నా కానీ అలాంటిది ఏమి జరగలేదు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు…

అటూ ఇటూగా 25 నుండి 30 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా మరో 6 లక్షలు అధికంగా వసూళ్ళని సాధించి ఉంటుందని అంచనా… సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 3.7 కోట్ల దాకా ఉండగా సినిమా 4 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…

కానీ ఇప్పటి వరకు సినిమా సాధించిన కలెక్షన్స్ పూర్తిగా నిరాశ పరిచే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో కూడా నిరాశ పరిచిన సినిమాల్లో ఈ సినిమా కూడా చేరనుంది. పోటిలో కాకుండా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే వచ్చిన టాక్ కి బెటర్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది అని చెప్పాలి. కానీ పోటి వలన…

సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. కానీ వచ్చే వారం పెద్దగా సినిమాలు ఏమి లేక పోవడంతో సినిమాకి టాక్ ఎలాగూ బాగానే ఉండటంతో మరింత ప్రమోషన్స్ జరిగిపితే సినిమా కలెక్షన్స్ ని కొద్ది వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here