బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయినా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న స్వాతిముత్యం సినిమా ఓపెనింగ్స్ తీవ్రంగా నిరాశ పరిచినా లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేకపోయింది. సినిమా మొత్తం మీద 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను టోటల్ రన్ లో…
మొత్తం మీద 1 కోటి లోపే షేర్ ని సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది, సోలో గా రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా సినిమాకి బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఇక సినిమాను మేకర్స్ మొత్తం మీద 8 కోట్ల రేంజ్ బడ్జెట్ లో…
నిర్మించగా సినిమా కి డిజిటల్ రైట్స్ కింద 3 కోట్ల దాకా రికవరీ అవ్వగా శాటిలైట్ రైట్స్ కింద 2.2 కోట్ల దాకా రికవరీ అయ్యిందని సమాచారం. మ్యూజిక్ అండ్ ఇతర రైట్స్ ద్వారా మరో 30 లక్షల దాకా రికవరీ అవ్వగా టోటల్ గా 5.50 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగగా…
సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయడంతో వాల్యూ బిజినెస్ లాస్ అయినా బయర్స్ కి పెద్దగా ఇబ్బంది రాలేదు… ఓవరాల్ గా బడ్జెట్ లో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి 6.50 కోట్లు రికవరీ అనుకున్నా నిర్మాతకి 1.50 కోట్ల రేంజ్ లాస్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా నిర్మాతకి నష్టాలనే మిగిలించింది అని చెప్పాలి.