టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది, ఖైదీ నంబర్ 150 తర్వాత రెండున్నర ఏళ్ళు టైం తీసుకుని చేసిన ఈ సెన్సేషనల్ మూవీ అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అని చెప్పాలి. ఆంగ్లేయుల పై పోరాడిన మొదటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించింది…
ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఆల్ మోస్ట్ రివీల్ చేసినప్పటికీ ప్రేక్షకులకు ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయితే అన్ని రికార్డులను తుడిచి పెట్టే రేంజ్ ఈ సినిమా కి ఉందని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. కథ పాయింట్ ఏంటి అనేది అందరికీ తెలిసి పోయినా కానీ…
ఆంగ్లేయుల పై పోరాడిన మొదటి వీరుడి గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియక పోవడం ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్… ట్రైలర్ చూపెట్టిన విజువల్స్ ని బట్టి ఆంగ్లేయులు ఇండియా లో ఎంటర్ అయ్యి చేస్తున్న అరాచకాలను అడ్డుకున్న మొదటి వీరుడిగా చిరంజీవి కనిపిస్తుండగా ఆయనికి తోడుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సహాయం చేసే వారిగా…
కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి… గురువుగా అమితాబ్ బచ్చన్, ప్రేయసి గా తమన్నా, పెళ్ళాడే యువతిగా నయనతార నటించారు…స్పెషల్ రోల్ లో అనుష్క నటించింది… ట్రైలర్ లో మెయిన్ హైలెట్స్ విషయానికి వస్తే విజువల్స్, టేకింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, గ్రాండియర్ ఇలా చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ట్రైలర్ లో ఏమి అనిపించకపోయినా ఇలాంటి పెట్రియాటిక్ కథలు ఈ మధ్య కాలంలో సక్సెస్ కాలేదు… ఇప్పుడు సైరా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఆసక్తి కరం… ట్రైలర్ లో చూపెట్టిన కొన్ని ఎమోషనల్ సీన్స్,….
ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కచ్చితంగా సైరా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఇక టాక్ పాజిటివ్ గా ఉంటే మెగాస్టార్ రేంజ్ తో మినిమం తెలుగు వర్షన్ 200 కోట్ల షేర్ ని అందుకోవడం ఖాయం… ఇక మాగ్జిమం ఎంత వరకు వెళుతుందో ఇతర భాషల రేంజ్ ని బట్టి ఉంటుంది. మొత్తం మీద ట్రైలర్ సినిమా పై ఉన్న క్రేజ్ ని ఓ పదింతలు పెంచేసింది అని చెప్పాలి.