ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. వాటిలో హర్రర్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమా తంత్ర(Tantra Movie Telugu Review)….ట్రైలర్ రిలీజ్ నుండే పిల్ల బచ్చాలు మా సినిమాకి రావొద్దు అంటూ డిఫెరెంట్ గా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసిన టీం ఎంతవరకు సఫలం అయ్యారో తెలుగుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే హీరోయిన్ అనన్య చిన్నప్పుడే తన తల్లి కోల్పోవడంతో భయం భయంగా పెరుగుతుంది, తనకి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి…చిన్నప్పటి నుండి తనతో పెరిగిన ధనుష్ రఘుముద్రిని ఇష్టపడతా తర్వాత తన పై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తెలుస్తుంది, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
హర్రర్, క్షుద్ర పూజలు ఇలాంటి కాన్సెప్ట్ అనగానే సినిమా మొత్తం బయపెట్టే సీన్స్ తో నింపేశారు అనుకుంటారు అందరూ…కానీ సినిమా ఓపెన్ అవ్వడం చాలా ఫ్లాట్ గా ఓపెన్ అవ్వగా చాలా స్లో నరేషన్ తో సాగే సినిమా లో అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా పేలవమైన స్క్రీన్ ప్లే వలన సినిమా చాలా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…
హర్రర్ సీన్స్ ఒకటి రెండు చోట్ల పర్వాలేదు అనిపించగా కొన్ని సీన్స్ చూసే విధంగా కూడా లేక పోవడంతో ఎటు నుండి ఎటో వెళుతూ తంత్ర విద్యలో 6 భాగాలు ఉంటాయి అంటూ ఒక్కో దానికి వివరణ ఇస్తూ సినిమా లెంత్ పెరిగి పోయి చూస్తున్న ఆడియన్స్ ఎప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురు చూసేలా చేసింది….
ఉన్నంతలో అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా పూర్తి అయ్యే వరకు కూర్చోవాలి అంటే చాలా చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. హర్రర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కొంచం ఎక్కువ ఓపిక చేసుకుని చూస్తె యావరేజ్ గా అనిపించవచ్చు, మిగిలిన ఆడియన్స్ చాలా ఓపికతో చూసినా పెద్దగా ఎక్కే అవకాశం లేదు అనే చెప్పాలి. సినిమాకి ఫైనల్ గా మా రేటింగ్ 2.25 స్టార్స్…