Home న్యూస్ ప్రేమలు 1st వీక్ తెలుగు కలెక్షన్స్….డే 1 కన్నా డే 7 ఎక్కువ సామి!

ప్రేమలు 1st వీక్ తెలుగు కలెక్షన్స్….డే 1 కన్నా డే 7 ఎక్కువ సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మిగిలిన సినిమాలు స్లో అయిన చోట మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Telugu 1st Week Collections)…. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి దుమ్ము లేపే రేంజ్ లో మొదటి వారాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది…

సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కన్నా కూడా 7వ రోజు వర్కింగ్ డే వసూళ్లు సాలిడ్ గా ట్రెండ్ ను చూపించడం విశేషం, 6వ రోజు కన్నా 7 వ రోజు వసూళ్లు ఇంకా పెరగడంతో రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

ప్రేమలు మూవీ 6వ రోజు 52 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుంటే 7వ రోజు 68 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఆల్ మోస్ట్ 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది… ఓవరాల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Premalu Telugu 1st Week (7 Days) Box Office Collections Report
👉Nizam: 1.15CR~
👉Total AP: 0.85CR~
Total AP-TG Collections:- 2.00CR~(3.75CR~ Gross)

ఓవరాల్ గా సినిమా తెలుగు వాల్యూ టార్గెట్ 1.5 కోట్లు కాగా సినిమా ఆ టార్గెట్ మీద ఆల్ రెడీ మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ $175K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా ఆ కలెక్షన్స్ తో కలిపి తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గ్రాస్ 5 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం, ఇక రెండో వీక్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here