Home న్యూస్ ఈ సినిమాకి 295 ఏంటి సామి….తెగింపు ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!!

ఈ సినిమాకి 295 ఏంటి సామి….తెగింపు ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ కి అక్కడ మార్కెట్ ఉండొచ్చు కానీ తెలుగు లో మాత్రం పెద్దగా మార్కెట్ లేదు, కానీ అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపు సినిమాకి వారసుడు ఇక్కడ పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో గ్రాండ్ రిలీజ్ దక్కినా కానీ రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కష్టం మీద 50 లక్షల రేంజ్ లో బుకింగ్స్ నైజాంలో 65 లక్షల రేంజ్ బుకింగ్స్ టోటల్ తెలుగు రాష్ట్రాలలో సొంతం అయ్యాయి.

పండగ టైంలో ఇంత గ్రాండ్ రిలీజ్ కి ఇలాంటి బుకింగ్స్ నిరాశకరం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి నైజాంలో PVR చైన్ థియేటర్స్ లో ఏకంగా 295 టికెట్ రేటు పెట్టారు, మిగిలిన మల్టిప్లెక్సులలో 200 రేటు పెట్టగా ఆంధ్రలో కూడా మల్టిప్లెక్సులలో 200 కి పైగా రేటు ఉంది…

తమిళ్ లో పెద్ద స్టార్ అయినా అజిత్ కి ఇక్కడ మార్కెటే లేదు అంటే ఏకంగా 295 టికెట్ రేటు పెట్టడం భారీగా బ్యాక్ ఫైర్ అవ్వబోతుంది. సినిమా ఓపెనింగ్స్ చూస్తూ ఉంటే తొలిరోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని….

సొంతం చేసుకునే అవకాశం ఉంది, టికెట్ రేట్స్ కొంచం నార్మల్ గా ఉండి ఉంటే ఆక్యుపెన్సీ ఇంకొంచం బెటర్ గా ఉండేది, ఓపెనింగ్స్ కూడా బెటర్ గా వచ్చేవి, సినిమా తెలుగు లో 3.50 కోట్లు అందుకోవాల్సిన అవసరం ఉంది… మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here