సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమాల్లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఇష్క్ సినిమా కూడా ఒకటి, లాక్ డౌన్ స్టార్ట్ అయ్యే టైం లోనే ధైర్యం చేసి ఏప్రిల్ 23 న సినిమాను రిలీజ్ చేయాలనీ ట్రై చేశారు కానీ అప్పటికే సెకెండ్ వేవ్ మరింత తీవ్ర తరం అవ్వడం తో సినిమా ను మిగిలిన సినిమాతో పాటు పోస్ట్ పోన్ చేశారు. సినిమా పనులు అన్నీ కంప్లీట్ అయ్యి…
రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా అవ్వడం తో సినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించాలని ట్రై చేశారు కానీ మేకర్స్ ని పెద్దగా స్పందన అనుకున్న విధంగా అయితే రాలేదు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఇష్క్ సినిమా రీమేక్ గా రూపొందిన ఈ సినిమా…
ఆడియన్స్ లో మినిమమ్ బజ్ ని అయితే క్రియేట్ చేసింది. ఇక తేజ సజ్జా రీసెంట్ మూవీ జాంబి రెడ్డి తో సూపర్ హిట్ అందుకోవడం తో ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కచ్చితంగా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని డిజిటల్ రిలీజ్ పై…
పెద్దగా స్పందించలేదు…. దాంతో OTT వాళ్ళు మరో ప్రయత్నంగా సినిమా డిజిటల్ రిలీజ్ రేటు ని కొంచం పెంచారు. రీసెంట్ గా సినిమా 8 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్ దక్కగా ఇప్పుడు రేటు పెంచి 9 కోట్ల రేంజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారట. సినిమా ఓవరాల్ బడ్జెట్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం… ఆ లెక్కన చూసుకుంటే…
సినిమా కి ఇప్పుడు వచ్చిన రేటు ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ అని చెప్పొచ్చు. కానీ మేకర్స్ ఇప్పుడు ఈ ఊరమాస్ రేటు కి ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. థియేటర్స్ ఆల్ రెడీ తెరిచారు కాబట్టి థియేట్రికల్ రిలీజ్ కి ట్రై చేసినా చేయోచ్చు కానీ థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ ఆఫర్ గురించి మరోసారి ఆలోచించే ఛాన్స్ ఉందని లేటెస్ట్ టాక్. మరి ఏమవుతుందో చూడాలి.