తెలుగు సినిమా లు తెలుగు ఆడటం గొప్ప కాదు, పరాయి గడ్డ పై కూడా రెచ్చి పోయి ఆడుతుంటేనే మన మార్కెట్ పెరిగేది. ఈ విషయాన్ని టాలీవుడ్ లో అందరి కన్నా మొదట గమనించిన హీరో మహేష్ బాబు. ఓవర్సీస్ లో తెలుగు వాళ్లకి మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించిన మహేష్ బాబు బాట లో కేరళ లో కూడా మన సినిమాలకు ఆదరణ ఉంటుందని చెప్పిన హీరో అల్లుఅర్జున్.
అల్లుఅర్జున్ చేసిన సినిమాలన్నీ అక్కడ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇతర స్టార్స్ కూడా అక్కడి మార్కెట్ పై కన్నేశారు. టాలీవుడ్ తో పోల్చుకుంటే అక్కడి మార్కెట్ విలువ తక్కువే అయినా మార్కెట్ విస్తరించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మనవాళ్ళు బాహుబలి, రుద్రమదేవి లాంటి యూనివర్సల్ సబ్జెక్టులను ఎంచుకుని అక్కడ సక్సెస్ సాధించారు. అలాంటివాటిలో టాప్ 5 లో సూపర్ గ్రాస్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు ఎవో తెలుసుకుందా౦ పదండి.
టాప్ 10 : ఎవడు
అల్లుఅర్జున్ కి అక్కడున్న క్రేజ్ ను వాడుకుని రామ్ చరణ్ హీరోగా చేసిన ఎవడు సినిమాను అక్కడ రిలీజ్ చేయగా అల్లుఅర్జున్ వీరాభిమానుల౦దరూ సినిమాను సూపర్ హిట్ చేశారు. సినిమా టోటల్ గా 1.72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 9 ప్లేస్ సొంతం చేసుకుంది.
టాప్ 9 : బద్రీనాథ్
అల్లుఅర్జున్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అంతంతమాత్రంగానే ఆడినా మలయాళంలో మాత్రం సూపర్ హిట్ అయింది. టోటల్ రన్ లో 2.35 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ 8 ప్లేస్ లో నిలిచి అల్లుఅర్జున్ కి మరో సూపర్ హిట్ ని ఇచ్చింది.
టాప్ 8 : రేసుగుర్రం
అల్లుఅర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రేసుగుర్రం మలయాళంలో టాలీవుడ్ తరుపున హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రేసుగుర్రం సినిమా టోటల్ రన్ లో 2.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి కొంతకాలం టాప్ ప్లేస్ లో సెటిల్ అయ్యింది.
టాప్ 7: సాహో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను తప్పగా సినిమా కేరళలో భారీ భీభత్సాలు నమోదు చేస్తుంది అనుకున్నా ఒకింత షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని అందుకుంది, ఫైనల్ రన్ లో 4 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసి పరుగును ఆపేసింది.
టాప్ 6 : రుద్రమదేవి
పేరుకు అనుష్క ప్రధానపాత్ర పోషించిన టాలీవుడ్ లో జనాలు సినిమా చూడటానికి వచ్చింది మాత్రం అల్లుఅర్జున్ కోసమే అని చెప్పొచ్చు. 30 నిమిషాల రోల్ ప్రతీ సీన్ అద్బుతంగా నటించిన అల్లుఅర్జున్ కోసమే కేరళ ప్రేక్షకులు వెళ్ళడంతో సినిమా టోటల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించి 4.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 6 ప్లేస్ లో నిలిచింది.
టాప్ 5 : జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ మోహన్ లాల్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కేరళ మార్కెట్ లో కూడా మంచి వసూళ్ళ తో దుమ్ము లేపింది, అక్కడ ఎన్టీఆర్ మొదటి డబ్ మూవీ నే అయినా మోహన్ లాల్ అండతో అక్కడ సినిమా 4.6 కోట్ల గ్రాస్ ని అందుకుంది దుమ్ము లేపుతూ టాప్ 5 ప్లేసులో నిలిచింది.
టాప్ 4: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అక్కడ డబ్ అయ్యి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించి ఫైనల్ రన్ లో ఏకంగా 5 కోట్ల మార్క్ ని అధిగమించి ఆల్ టైం టాప్ 4 ప్లేసు ని దక్కించుకుంది.
టాప్ 3 : సరైనోడు
అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన సరైనోడు సినిమా యోద్దోవ్ పేరు తో అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఫైనల్ రన్ లో అందరు హీరోల కన్నా కూడా 7.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసి నాన్ బాహుబలి అత్యధిక కలెక్షన్స్ ని అక్కడ సాధించి సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
టాప్ 2 :బాహుబలి
2015 ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సినిమా బాహుబలి, ప్లేస్ ఏదైనా రికార్డుల దుమ్ము దులపడమే ధ్యేయంగా పెట్టుకున్న బాహుబలి కేరళలో కూడా రికార్డుల బూజు దులిపి టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవ్వరూ తెలియకపోయినా మౌత్ టాక్ తో రికార్డు స్థాయి విజయం సొంతం చేసుకున్న బాహుబలి టోటల్ గా 14.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 2 చెయిర్ సొంతం చేసుకుంది.
టాప్ 1 : బాహుబలి పార్ట్ 2
కేరళ ఇండస్ట్రీ పై ఒక పరాయి భాష సినిమా మునుపెన్నడూ లేని విధంగా వీర లెవల్ లో భీభత్సం సృష్టిస్తూ మరే సినిమా కూడా కలలో కూడా ఊహించని ఊచకోత కోసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులతో ఏకంగా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అక్కడ అందుకుని ఇప్పట్లో మరే డబ్బింగ్ మూవీ కూడా దరిదాపుల్లోకి రాలేని రికార్డ్ ను సొంతం చేసుకుని టాప్ చెయిర్ ని సొంతం చేసుకుందో.
ఇవి టాప్ 10 సినిమాలు. ఇందులో 6 సినిమాలు అల్లుఅర్జున్ వే ఉండటం అక్కడ అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. ఇందులో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
Janata garage jai ntr jai jai ntr