వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మూట పడి నెలలు కావొస్తున్న విషయం అందరికీ తెలిసిందే, కరోనా ఎఫెక్ట్ తో ఫిబ్రవరి మార్చ్ టైం నుండే థియేటర్స్ ని మూసేయగా సినిమా లు లేక చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూస్తూ అందరూ టైం గడిపేస్తున్నారు. ఇక కొన్ని దేశాల్లో కరోనా తగ్గడం, కొన్ని చోట్ల తగ్గక పోయినా కానీ ఇన్ని నెలలుగా మూసేస్తే ఏమి తగ్గలేదు అన్న వాదనతో థియేటర్స్ ని రీ ఓపెన్ చేశారు.
రీ ఓపెన్ చేశాక పాత చిన్నా చితకా సినిమాలను లేదా పాత హిట్ మూవీస్ ని రీ రిలీజ్ చేయగా వాటికి స్పందన పెద్దగా రాలేదు. దాంతో అందరూ థియేటర్స్ మళ్ళీ ఓపెన్ చేయడం విమర్శలు గుప్పించాగా… ఇలాంటి టైం లో కొత్త సినిమాల….
రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని టైం లో హాలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన మోస్ట్ వాంటెడ్ మూవీ టెనెట్ ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయగా ఇది మూర్ఖత్వం అని అంతా వెక్కిరించారు తిరస్కరిస్తారు అని చెప్పారు కూడా..
కానీ ఇవేవి పట్టించుకోకుండా థియేటర్స్ రీ ఓపెన్ చేసిన అన్ని దేశాల్లో టెనెట్ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అవ్వగా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా వీకెండ్ తర్వాత తగ్గిపోతుంది అనుకున్న వాళ్లకి మళ్ళీ షాక్ ఇస్తూ. రెండో వీకెండ్ లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది.
మొత్తం మీద 12 రోజుల్లో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్ మోస్ట్ 150 మిలియన్ డాలర్స్ ని అంటే ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే 1094 కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించి అందరి మైండ్ బ్లాంక్ చేసే రేంజ్ లో దూసుకు పోతుంది. దాంతో ఇప్పుడు అందరూ తిరిగి థియేటర్స్ లో సినిమాల రిలీజ్ కి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇక ఇండియా లో థియేటర్స్ రీ ఓపెన్ పరిస్థితి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…