Home న్యూస్ గుంటూరు కారం ఔట్….టిల్లు స్క్వేర్ టాప్ 2!!

గుంటూరు కారం ఔట్….టిల్లు స్క్వేర్ టాప్ 2!!

0

2024 ఇయర్ లో మొదటి 3 నెలల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో అన్నింటిలోకి పెద్ద సినిమా అంటే మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram) అని చెప్పొచ్చు, కానీ మిక్సుడ్ రెస్పాన్స్ వలన ఈ సినిమా పూర్తిగా అంచనాలను అందుకోలేక పోయింది.

దాంతో మిగిలిన సినిమాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్(HanuMan Movie) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా ఇక్కడతో పాటు ఓవర్సీస్ లో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ గుంటూరు కారం కన్నా ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుంది. 

ఇక లేటెస్ట్ గా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చినా ఈ రేంజ్ లో జోరు చూపెడుతుంది అని ఎక్స్ పెర్ట్ చేయని టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇప్పుడు గుంటూరు కారం టోటల్ రన్ కలెక్షన్స్ ని అమెరికాలో క్రాస్ చేసింది.

Guntur Kaaram 10 Days Total WW Collections!

గుంటూరు కారం టోటల్ రన్ లో 2.63 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని రాబడితే హనుమాన్ మూవీ టోటల్ రన్ లో 5.26 మిలియన్ డాలర్స్ తో ఈ ఇయర్ టాపర్ గా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు రెండో ప్లేస్ లో ఉన్న గుంటూరు కారం మూవీని క్రాస్ చేసిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటి వరకు…

అమెరికాలో 2.69 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఫైనల్ రన్ లో అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఈ సినిమా కి ఉంది. ఇక ఈ ఇయర్ లో వచ్చే ఇతర సినిమాల్లో హనుమాన్ టిల్లు స్క్వేర్ లాగా మాస్ రాంపెజ్ ను చూపించే సర్పైజ్ మూవీస్ గా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

Tillu Square 10 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here