ఒకప్పటిలా సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ అస్సలు ఉండటం లేదు, మహా అయితే మూడు వారాలు థియేటర్స్ లో ఆడుతున్నాయి సినిమాలు, తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవుతున్నాయి. దాంతో జనాలు కూడా ఎంత పెద్ద సినిమా అయినా మహా అయితే నెల లోపే డిజిటల్ లోకి వస్తుంది కాబట్టి అంతంత రేట్లు పెట్టి థియేటర్స్ కి వెళ్ళడం కన్నా డిజిటల్ లోనే చూడటానికి ఇష్టపడుతున్నాడు. దాంతో థియేటర్స్ రెవెన్యూ తగ్గుతూ వస్తుంది.
దాంతో రీసెంట్ గా టాలీవుడ్ పెద్దలు ఒక మీటింగ్ పెట్టుకుని ఒక గట్టి నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం ప్రకారం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాలు…
రిలీజ్ అయిన తర్వాత 6 వారాల గ్యాప్ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, ఈ కొత్త నిర్ణయం జులై 1 నుండి వర్తిస్తుంది, ఈ మధ్యే ఎవరైనా అగ్రిమెంట్స్ కనుక జరిపి ఉంటె ఆ డీల్స్ ని కాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రేట్లు ఎక్కువ ఆఫర్ చేస్తే ఓకే చెప్పే వాళ్ళకి ఇది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మరి ఇది అనుకున్న విధంగా అములులోకి వస్తే థియేటర్స్ కి మునుపటిలా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది.