బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు. సినిమా సాంగ్స్ ఆల్ రెడీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం వలన బజ్ అమాంతం పెరిగిపోయింది..
ఫిబ్రవరి నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తండేల్ మినిమమ్ టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా కి ముందు వరుస ఫ్లాఫ్స్ లో నాగ చైతన్య ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కోసం…
తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు….ముందు 60-70 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అనుకున్నా కూడా అది పెరిగి పెరిగి ఏకంగా 90 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం అవ్వగా…ఆ బడ్జెట్ రికవరీ అవుతుందో లేదో అన్న డౌట్స్ ముందు వచ్చినా కూడా…
ఇప్పుడు రికవరీ కూడా బడ్జెట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా జరుగుతూ ఉండటం విశేషం. సినిమా ఓవరాల్ గా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ఇలా అన్నీ కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఊహకందని రేంజ్ లో బిజినెస్ చేసిందని సమాచారం… ఓవరాల్ గా అన్నీ కలిపి…
సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 50 కోట్ల కి చేరువ అయ్యే రేంజ్ లో బిజినెస్ రికవరీ జరిగింది అని అంటున్నారు. బడ్జెట్ లో సగానికి పైగా రికవరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ నుండే జరిగింది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ…
తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో సాలిడ్ రేట్స్ నే సొంతం చేసుకుంటూ ఉండటంతో మేకర్స్ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 7న తండేల్ మూవీ తో నాగ చైతన్య సాయి పల్లవి ఎలాంటి మ్యాజిక్ చేసి సాలిడ్ హిట్ కొడతారో చూడాలి.