Home న్యూస్ ఇదే ఫైనల్…..తండేల్ మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…..తండేల్ మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో సైతం ఆడియన్స్ లో మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడంతో మంచి బజ్ ను సొంతం చేసుకుని గ్రాండ్ గా రిలీజ్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ కి ఓవర్సీస్ లో….

ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా…ఇక్కడ రెగ్యులర్ షోలకు మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక డే ఎండ్ అయిన తర్వాత ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…

సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది, లవ్ స్టోరీ నే అయినా కూడా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసేలా సీన్స్ ను డిసైన్ చేయడం, నాగ చైతన్య సాయి పల్లవిల నటన మెప్పించింది అని, సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్…

చాలా బాగా మెప్పించాయి అని చెబుతున్నారు, ఇండియా పాకిస్థాన్ ఎపిసోడ్ మరీ అంతగా ఎక్కలేదు కానీ ఆ ఎపిసోడ్ కాకుండా మిగిలిన సినిమా మొత్తం ఆకట్టుకుంది అని అంటూ ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించింది అని అంటున్నారు…

ఇక కామన్ అండ్ మాస్ ఆడియన్స్ నుండి సినిమా లో లవ్ సీన్స్ అండ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగానే పండినా కూడా ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం, అలాగే ఇండియా పాకిస్థాన్ ఎపిసోడ్ అప్పటి వరకు ఉన్న మంచి ఫీల్ గుడ్ ఎక్స్ పీరియన్స్ ను..

ఓవర్ ది బోర్డ్ సీన్స్ తో కొంచం తగ్గించినట్లు అనిపించింది అని అంటున్నారు, కానీ తిరిగి క్లైమాక్స్ పోర్షన్ బాగుండటంతో ఓవరాల్ గా సినిమా అంచనాలను అయితే అందుకుంది అని చెబుతూ టోటల్ గా సినిమా ఎబో యావరేజ్ లెవల్ లో ఉందని అంటున్నారు.

మొత్తం మీద సినిమాకి మొదటి రోజు ఎండ్ అయ్యే టైంకి ఫైనల్ గా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో అయితే రిపోర్ట్ సెట్ అయ్యింది అని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమాకి లాంగ్ రన్ సొంతం అయ్యేలా చేయడానికి ఈ టాక్ సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ టాక్ తో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

1 COMMENT

  1. సినిమా చాలా బాగుంది దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు కొన్ని సీన్లలో నాగచైతన్య ఏడిపించారు సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది నాగచైతన్య సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ గా నిలుస్తుందని బెస్ట్ మూవీ రేటింగ్ రాసే వాళ్ళు కూడా అంత మంచి సినిమా వస్తే కూడా ఆవరేజ్ ఏంటండి 100 కి 100 మూవీకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here