Home న్యూస్ తండేల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

తండేల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా వరల్డ్ వైడ్ గా 37 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సుమారు 1700 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది.

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ…ప్రేమికులు అయిన హీరో హీరోయిన్స్ కి ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ అనుకుండా వీళ్ళు విడిపోవాల్సి వస్తుంది. హీరో పాకిస్థాన్ లో ఇరుక్కోగా వీళ్ళ ప్రేమ ఏమయింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ పాయింట్ కొంచం రొటీన్ గానే అనిపించినా కూడా ఎంచుకున్న నేపధ్యం డిఫెరెంట్ గా ఉండటంతో సినిమా చాలా వరకు ఫ్రెష్ ఫీల్ నే కలిగించింది అని చెప్పాలి. సినిమా ఓపెన్ అవ్వడమే ఆసక్తిగా ఓపెన్ అయ్యి తర్వాత హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ ఆసక్తిగా సాగుతూ…

మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో ఒక టెంపోని అలానే మెయిన్ టైన్ చేస్తూ సాగగా ఫస్టాఫ్ కథ పెద్దగా లేక పోయినా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ లు మెప్పించిన తర్వాత ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా…సెకెండ్ ఆఫ్ కథ సీరియస్ టర్న్ తీసుకున్నా కూడా..

నాగ చైతన్య సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ సాగి మెలో డ్రామా కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఆకట్టుకుంటూ క్లైమాక్స్ కూడా మెప్పించింది…కానీ కొంచం డ్రాగ్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా కూడా ఎబో యావరేజ్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ మెలో డ్రామా ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం ఫైనల్ రిజల్ట్ చాలా బాగా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా, ఓవరాల్ గా ప్రీమియర్స్ తర్వాత సినిమాకి ఎబో యావరేజ్ లెవల్ లో రిపోర్ట్ లు..

వినిపిస్తూ ఉండగా ఇదే రేంజ్ లో టాక్ కానీ దీనికి మించిన టాక్ కానీ రెగ్యులర్ షోల టైంకి సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య మ్యాజిక్ చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొదటి రోజు సినిమాకి ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here