యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొనగా…బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత నాగ చైతన్య నటించిన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో ఆడియన్స్ లో బజ్ బాగా ఏర్పడింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…స్నేహితుల నుండి ప్రేమికులుగా మారిన హీరో హీరోయిన్స్ కి ఒకరంటే ఒకరికి ప్రాణం..కానీ హీరోయిన్ హీరో చేసే ఫిషర్ మాన్ వర్క్ చాలా రిస్క్ అని, పెళ్లి అయ్యాక ఆపెయ్యలని అంటుంది…దానికి ఒప్పుకున్న హీరో అనుకోకుండా ఒకసారి పాకిస్థాన్ బార్డర్ దాటుతారు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా కథ పాయింట్…
కథ పాయింట్ నార్మల్ గానే అనిపించినా కూడా హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, టెర్రిఫిక్ సినిమాటోగ్రఫీ లాంటివి తండేల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ గా మారాయి…సినిమా స్టార్ట్ అవ్వడం కొంచం స్లోగానే స్టార్ట్ అయినా కూడా..
సూపర్ హిట్ అయిన సాంగ్స్ వరుసగా వస్తూ సినిమా స్లో అవ్వకుండా చేయగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయ్యి సెకెండ్ ఆఫ్ కి మంచి లీడ్ ఇవ్వగా సెకెండ్ ఆఫ్ కథ కంప్లీట్ గా పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటూ సాగి ఇండియా పాకిస్థాన్ నేపధ్యంతో అలాగే…
ఆర్టికల్ 370 టచ్ తో ఆలోచింపజేసేలా చేస్తూ చివరి అరగంట హృదయానికి హత్తుకునే సీన్స్ తో ఓ ఇంటెన్స్ లవ్ అండ్ పెట్రియాటిసంతో మెప్పించింది అని చెప్పాలి. నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఇద్దరూ పోటి పడి నటించగా…కెరీర్ లోనే వన్ ఆఫ్ ది లేదా…ది బెస్ట్ అనిపించే పెర్ఫార్మెన్స్ తో…
నాగ చైతన్య కుమ్మేశాడు, కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అవ్వగా డైలాగ్స్ మొదట్లో అర్ధం అవ్వడానికి కొంచం టైం పట్టినా తర్వాత ఆ ఫ్లో బాగా మెయిన్ టైన్ చేశారు. ఇక సాయి పల్లవి మరో గుర్తు ఉండిపోయే రోల్ లో ఆదరగోట్టేసింది…
మిగిలిన యాక్టర్స్ అందరూ మెప్పించగా దేవి శ్రీ ప్రసాద్ అటు పాటలు ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఫుల్ మార్కులు కొట్టేసి ఒకప్పటి వింటేజ్ దేవి శ్రీని గుర్తు చేశాడు….ఇక స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ మొదటి 45-50 నిమిషాలు కొంచం స్లో అనిపించినా తర్వాత అంతా బాగానే ఆకట్టుకుంది…
సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…ఇక చందు మొండేది డైరెక్షన్ ఆకట్టుకుంది. కథ పాయింట్ కొంచం నార్మల్ గానే అనిపించినా కూడా పెర్ఫార్మెన్స్ లు ఎక్స్ లెంట్ గా ఉండటం, మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ గా సెట్ అవ్వడంతో కథలో లోపాలు ఉన్నప్పటికీ…
అవి పెద్దగా ఏమి ఇంపాక్ట్ చూపించలేదు..కానీ మొదటి గంట ఇంకా బెటర్ గా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది…ఓవరాల్ గా నాగ చైతన్య-సాయి పల్లవి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్, మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్….గుడ్ సెకెండ్ ఆఫ్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే…
స్టోరీ కొంచం ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, టేక్ ఆఫ్ కి కొంచం పట్టడం లాంటివి చిన్న డ్రా బ్యాక్స్…అయినా కూడా సినిమాకి అంచనాలతో వెళ్ళిన ఆడియన్స్ కానీ..అంచనాలు లేకుండా వెళ్ళిన ఆడియన్స్ కానీ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….