అనసూయ ప్రధాన పాత్రలో విరాజ్ అశ్విన్ ముఖ్య రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు బ్రదర్, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఆహా లో సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అనసూయ ప్రెగ్నంట్ లేడీ…
నెలలు నిండిన సమయంలో అనుకోకుండా ఆమె భర్త చనిపోతాడు, భర్త కి రావాల్సిన చెక్ తీసుకోవడానికి ఒక అపార్ట్ మెంట్ కి వెళ్ళిన టైం లో ఒక లిఫ్ట్ లో ఎక్కుతుంది, లిఫ్ట్ లో మరో వ్యక్తీ ఉంటాడు, ఆ కుర్రాడు డబ్బున్నా చెడు అవలట్లాకు భానిసై….
తల్లితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. అలాంటి ఈ ఇద్దరూ లిఫ్టు లో కరోనా ఎఫెక్ట్ వలన బంద్ వలన ఇరుక్కుంటారు, వాళ్ళని సేఫ్ చేయడానికి లిఫ్ట్ మెకానిక్ కూడా ఉండరు, అలాంటి టైం లో ఇద్దరూ ఆ లిఫ్టు నుండి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా స్టొరీ పాయింట్ అని చెప్పొచ్చు.
లెంత్ చాలా తక్కువ ఉన్నా కానీ విపరీతమైన స్లో నరేషన్ తో సాగే సినిమాలో విరాజ్ అశ్విన్ రోల్ పై ఏకంగా 40 నిమిషాల ఎపిసోడ్ తో బోర్ కొట్టించారు, అనసూయ ఫ్లాష్ బ్యాక్ ఒక సాంగ్ లో చెప్పేశారు. ఇద్దరూ లిఫ్ట్ లో ఇరుక్కున్న తర్వాత ఆసక్తిగా సాగాలసిన స్క్రీన్ ప్లే బోర్ గానే సాగుతూ ఉంటుంది… మొత్తం మీద ఎండ్ అవ్వడం కొంచం ఎమోషనల్ గా ఎండ్ అయ్యి…
ఎదో ముగిసిందిలే అనిపిస్తుంది. అనసూయ తన రోల్ కి ఫుల్ న్యాయం చేసినా విరాజ్ అశ్విన్ జస్ట్ ఓకే అనిపించాడు, కథ పాయింట్ బాగున్నా టేకింగ్ చాలా నీరసంగా ఉన్నా 100 నిమిషాలు కూడా లేని సినిమా చాలా బోర్ కొడుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే, అక్కడక్కడా ఫోర్సుడ్ కామెడి, కథ పాయింట్ లో ఉన్న దమ్ము స్క్రీన్ ప్లే లో లేకపోవడం…
చాలా స్లో గా సీన్స్ మూవ్ అవ్వడం, స్క్రీన్ ప్లే ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్, కథ పాయింట్ ని కాపీ కొట్టారు కానీ సరిగ్గా తిరిగి ఇంటెన్స్ గా తీయలేక పోయారు. ఖాళీ టైం లో ధైర్యం చేసి ఒకసారి చూడాలి అనుకున్నా పార్టు పార్టులుగా నే సినిమాను కంప్లీట్ చేయోచ్చు….