Home న్యూస్ 1.8 కోట్ల రేటు…కానీ సినిమా లెంత్ మాత్రం ఇంత తక్కువా!!

1.8 కోట్ల రేటు…కానీ సినిమా లెంత్ మాత్రం ఇంత తక్కువా!!

0

సమ్మర్ రేసులో నిలవాల్సిన అనేక సినిమాలు ఇప్పుడు సెకెండ్ వేవ్ పీక్ స్టేజ్ కి వెళ్ళడం తో ఏం చేయాలో తెలియక అన్నీ పోస్ట్ పోన్ లు అవ్వగా చిన్న సినిమాలు కొన్ని థియేటర్స్ లో తమ లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేశాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమాలు చూడటానికి జనాలు ఏమాత్రం ఆసక్తి ని చూపడం లేదు. ఇక కొన్ని సినిమాలు మంచి ఆఫర్స్ వస్తే చాలు…

డిజిటల్ లో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు అలానే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా థాంక్ యు బ్రదర్… సెకెండ్ వేవ్ లో టాలీవుడ్ నుండి డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా ఈ సినిమా ఆహా లో రిలీజ్ కానుంది.

టీసర్ ట్రైలర్ తో కొంచం క్యూరియాసిటీ ని పెంచిన ఈ సినిమా కథ పాయింట్ మొత్తాన్ని నైజీరియన్ మూవీ ఎలేవేటర్ బేబీ అనే సినిమా నుండి కాపీ కొట్టారు అన్న అపవాదులు ఉండగా సినిమా రన్ టైం కూడా ఆ సినిమా ఉన్నట్లే చాలా తక్కువగా ఉంది. థాంక్ యు బ్రదర్ సినిమా మొత్తం మీద…

కేవలం 1 గంటా 30 నిమిషాల లెంత్ తోనే రూపొందిన సినిమా అని అంటున్నారు. ఈ చిన్న లెంత్ తో థియేటర్స్ లో రిలీజ్ అయినా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండేది కాదనే చెప్పాలి. దాంతో డిజిటల్ రిలీజ్ ను ఎంచుకుని మంచి పని చేసిన ఈ టీం కి ఆహా యాప్ వాళ్ళు డిజిటల్ రిలీజ్ కి గాను మొత్తం మీద…

1.8 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. బడ్జెట్ కూడా కొంచం తక్కువే కాబాట్టి సినిమా కి డిజిటల్ రిలీజ్ ద్వారా మంచి రేటు సొంతం అయింది అని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, ఆహా వాళ్లకి ఎన్ని రోజుల్లో వ్యూస్ తో ప్రాఫిట్స్ తెస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here