Home న్యూస్ ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie Review Rating) మూవీ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది…. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….కుటుంబ భారాన్ని మోసే ఒక మిడిల్ క్లాస్ హీరో తన ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు, తన లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత తన లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. 

చాలా బేసిక్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైమే పట్టింది అని చెప్పాలి. పాత్రల పరిచయం తర్వాత హీరోయిన్ తో సీన్స్ పర్వాలేదు అనిపించేలా సాగుతూ పడుతూ లేస్తూ సాగిన ఫస్టాఫ్ మొత్తం మీద పర్వాలేదు అనిపించేలా ముగియగా ఫైట్ సీన్స్ కొంచం ఇరికించినట్లు అనిపించినా కూడా బాగానే ఉన్నాయి…

ఇక ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ ఆఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉండగా కథని అమెరికాకి షిఫ్ట్ చేసి డైరెక్టర్ మరింతగా సాగదీశాడు అనిపించింది, కొన్ని క్రింజ్ అనిపించే సీన్స్ కూడాకామెడీ పేరుతో పెట్టారు…. ఓవరాల్ గా వీక్ స్టోరీ పాయింట్ తో వచ్చిన ఈ సినిమా కి…

విజయ్ దేవరకొండ ఎంత చేయగలడో అంతా చేశాడు, తన పెర్ఫార్మెన్స్ బాగుండగా యాక్షన్ సీన్స్ లో హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక హీరోయిన్ మృణాల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కాగా ఇద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది అని చెప్పాలి. ఇక మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో బాగానే నటించారు… సంగీతం సినిమా కి మేజర్ డ్రా బ్యాక్….

పాటలు అంచనాలను అందుకోలేదు…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా ఏమి లేదనే చెప్పాలి…. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో ఇంకా ట్రిమ్ చేసి ఉంటే ఇంకొంచం క్రిస్ప్ గా ఉండేది…. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్టర్ పరశురాం ఎంచుకున్న పాయింట్ చాలా వీక్ గా ఉండగా..

ఉన్నంతలో లీడ్ పెయిర్ బాగానే నటించి మెప్పించడం, ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఉండటం, లాంటివి ఓకే కానీ సెకెండ్ ఆఫ్ లో కథ లేక పోవడంతో కథ ఎటు నుండి ఎటో వెళుతుంది…. గీత గోవిందం(Geetha Govindam) లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తారు అందరూ… కానీ పరశురాం ఆ అంచనాలను అందుకోలేక పోయాడు…

టీం చెప్పినట్లు గీత గోవిందం ఆన్ స్టేరైడ్స్ రేంజ్ లో ఉంటుంది అని నమ్మి భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళితే మట్టుకు నిరాశ ఎక్కువ కలుగుతుంది… కానీ ఒక సింపుల్ మూవీ చూద్దాం అనుకుని థియేటర్స్ కి వెళితే కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు ఈ సినిమా…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here