కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ సినిమా జానర్ దృశ్యా అండ్ పోటీ దృశ్యా ఉన్నంతలో మంచి రిలీజ్ నే సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మొత్తం మీద 700 థియేటర్స్ లో 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ…
మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ మరీ జోరు చూపించలేదు అనే చెప్పాలి. దాంతో టోటల్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ది ఘోస్ట్ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి.
టాక్ పాజిటివ్ గా ఉంటె షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉండగా ప్రజెంట్ బుకింగ్స్ ని గమనిస్తే… నైజాంలో 20% రేంజ్ లో బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో 15% రేంజ్ లో బుకింగ్స్ ఉన్నాయి. ఈ లెక్కన సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా…
2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే సినిమా మొదటి రోజు 3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.