బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత థియేటర్స్ దాదాపుగా రీ ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రలో పరిస్థితులు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా అయితే లేవనే చెప్పాలి. టికెట్ రేట్లు 150 – 200 వరకు ఉన్నవి అమాంతం తగ్గించేసి కేవలం 20, 30, 40, కొన్ని చోట్ల మాత్రం 80 వరకు పెట్టారు, దాంతో ఈ రేట్లతో సినిమాలను ఆడించలేం అంటూ థియేటర్ ఓనర్స్ థియేటర్స్ ని మూసేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ని తట్టుకుని…
రిలీజ్ అయిన తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి వారం లోనే ఇబ్బందులను ఎదురుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఇప్పుడు. దానికి కారణం కూడా ఆంధ్రలో పరిస్థితులే.. అక్కడ థియేటర్ ఓనర్లు… ఈ రేట్లు వద్దని కొంచం పెంచి…
AC థియేటర్స్ లో 100, ఎయిర్ కూల్ థియేటర్స్ లో 80, నాన్ AC థియేటర్స్ లో 60 గా టికెట్ రేట్లు పెట్టాలి అంటూ ప్రభుత్వాన్ని అడగగా… వాళ్ళు త్వరలో రెస్పాన్స్ ఇస్తే ఒకే లేదంటే ఆగస్టు 6 నుండి థియేటర్స్ ని ఆంధ్రాలో కంప్లీట్ గా మూసేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు.
ఈ విషయాన్ని ఆల్ రెడీ పెద్దల దృష్టి కి కూడా తీసుకు వెళ్ళారు. దాంతో వాళ్ళు కొన్ని రోజుల్లో సానుకూలంగా స్పందించాలని ఆశిస్తున్నారు వీరు.. ఇది అప్ కమింగ్ మూవీస్ విషయంలో హెల్ప్ అయ్యే అవకాశం ఉండగా ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యేలా చేసిన తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమాలకు ఈ పరిస్థితులు మరింత అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
ఒకవేళ థియేటర్స్ మూసేయాలని నిర్ణయం తీసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయినట్లే అని చెప్పాలి. కానీ ప్రభుత్వం ఆంధ్రలో విదించిన నైట్ కర్ఫ్యూ పూర్తీ అయ్యే టైం కి కచ్చితంగా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం అని చెబుతుందట. దాంతో ఆగస్టు 6 న థియేటర్స్ ని మూసేయకూడదు అని అంటున్నారట. మరి థియేటర్ ఓనర్స్ ఫైనల్ నిర్ణయం ఏంటి అనేది ఇంకా చెప్పలేదు. త్వరలోనే తెలుస్తుంది.