Home న్యూస్ 40 కోట్ల సినిమా…లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్…సాలిడ్ ఫైన్ వేసిన మేకర్స్!

40 కోట్ల సినిమా…లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్…సాలిడ్ ఫైన్ వేసిన మేకర్స్!

0

లోకల్ ఛానెల్స్ గురించి తెలిసిందే గా… రిలీజ్ అయిన అన్ని సినిమాల మాస్టర్ ప్రింట్ లు ఇలా రిలీజ్ అవుతాయో లేదో టెలికాస్ట్ చేసేదాకా ఆగలేరు… కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్ది టైం అయ్యాక మాస్టర్ ప్రింట్ ని డిజిటల్ లో రిలీజ్ కోసమో లేక టెలివిజన్ లో రిలీజ్ కోసమో రిలీజ్ చేస్తారు… అప్పటికే ఆ సినిమాల…

రన్ కంప్లీట్ అయ్యి ఉంటుంది కాబట్టి లోకల్ ఛానెల్స్ ఆ సినిమాను టెలికాస్ట్ చేసినా కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ లాస్ట్ ఇయర్ నుండి పరిస్థితులు మారి కొత్త సినిమాలు భారీ రేటు పెట్టి డిజిటల్ లో రిలీజ్ చేయిస్తున్నాయి OTT యాప్స్… ఆల్ మోస్ట్ థియేటర్స్ లో రిలీజ్….

అయ్యే టైం లో అయ్యే బిజినెస్ కన్నా కూడా ఎక్కువ రేటు కి సినిమా హక్కులను సొంతం చేసుకుంటూ ఉంటే ఆ సినిమాలు రిలీజ్ అయిన మరుసటి రోజు నుండే లోకల్ ఛానెల్స్ లో మాస్టర్ ప్రింట్ లను టెలికాస్ట్ చేస్తున్నారు చాలా లోకల్ ఛానెల్స్ వాళ్ళు.

దాంతో ఈ విషయం మూవీ టీం కి తెలిసినప్పుడల్లా వాళ్ళ పై ఫైన్ వేస్తున్నా అవి ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళు. లేటెస్ట్ గా 40 కోట్ల రేటు పలికిన నారప్ప సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ప్రింట్ వచ్చేయడం తో లోకల్ ఛానెల్స్ లో వేయడం మొదలు పెట్టేశారట. కొందరు లోకల్ ఛానెల్స్ వాళ్ళు వేసిందే మళ్ళీ మళ్ళీ వేయడం తో వాటి గురించి తెలుసుకుని…

ఒక్కొక్కరి పై 30 లక్షల దాకా ఫైన్ కట్టాలి అంటూ కోర్టు నోటిసులు పంపారని తెలుస్తుంది. ఆల్ మోస్ట్ ఓ డజను ఛానెల్స్ కి ఇలాంటి నోటిసులు వెళ్లాయని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ ఉంది. ఇలాంటివి ఇది వరకు కూడా జరిగినా వీళ్ళు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సినిమాలను టెలికాస్ట్ చేస్తూ వ్యూవర్ షిప్ ను పెంచుకుంటున్నారు. మరి ఈ సారి అయినా సీరియస్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here