ఆల్ మోస్ట్ ఆఫ్టర్ 3 మంత్స్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 2 కొత్త సినిమాలతో రీ ఓపెన్ అయింది. మొత్తంగా కాకున్నా పర్వాలేదు అనిపించే విధంగా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఇక రెండు సినిమాలు వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అవ్వగా మొదటి రోజు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయి అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.
ముందుగా తిమ్మరుసు సినిమాను గమనిస్తే… సినిమా కి ఆడియన్స్ లో టాక్ పాజిటివ్ గా ఉంది కానీ ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించుకునే లెవల్ లోనే సొంతం అయ్యాయి, కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం తో మెల్లి మెల్లిగా పుంజుకున్న సినిమా ఓవరాల్ గా…
యావరేజ్ ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోబోతుంది. ఇక ఇష్క్ సినిమా కి పబ్లిసిటీ బాగా చేయడం తో కొంచం బెటర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, కానీ రెండు సినిమాలకు ఆంద్రలో టికెట్ రేట్లు అతి సాదారణంగా ఉండటం, ఆక్యుపెన్సీ 50% వరకు మాత్రమె ఉండటం…
వాటికి తోడూ నైట్ కర్ఫ్యూ ని ఆగస్టు 14 వరకు పొడగించడం తో 10 లోపే థియేటర్స్ మూసేయల్సిన పరిస్థితి రావడం లాంటివి కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపగా ఇవన్నీ చూసుకుంటే సినిమాలకు కొంచం దెబ్బ పడినట్లే అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ డే తిమ్మరుసు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల నుండి 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించవచ్చు.
ఇక ఇష్క్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 లక్షల కి పైగా కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకునే ఆవకాశం ఉంది, రెండు సినిమాల ఓవరాల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కంప్లీట్ గా రాలేదు కాబట్టి అవి బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకాస్త ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక.