సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అవ్వగా ఆడియన్స్ ముందుకు 2 సినిమాలు బరిలోకి దిగాయి, ఆ రెండు సినిమాలే తిమ్మరుసు మరియు ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ సినిమాలు. రెండు కూడా రీమేక్ లు అవ్వడం, ఒరిజినల్స్ బాగా మెప్పించడం తో రీమేక్ లు కూడా అలానే మెప్పిస్తాయి అనుకున్న తిమ్మరుసు అంచనాలను అందుకుంటే ఇష్క్ అందుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ కనిపించగా…
మొదటి రోజు మార్నింగ్ షోల టైం లో ఇష్క్ కొంచం లీడ్ చూపెట్టినా ఓవరాల్ గా తిమ్మరుసు పుంజుకుని పర్వాలేదు అనిపించుకుంది. ఇక రెండో రోజు మాత్రం తిమ్మరుసు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా మొదటి రోజు 16 లక్షల దాకా షేర్ ని…
అందుకుంటే రెండో రోజు 26 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 42 లక్షల షేర్ ని సాధించగా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 56 లక్షల దాకా షేర్ ని సినిమా సాధించింది. ఇక ఇష్క్ సినిమా ఫస్ట్ డే 15 లక్షల షేర్ ని అందుకోగా…
రెండో రోజు ఇంకా తగ్గి 12 లక్షల షేర్ ని సాధించి టోటల్ గా 2 రోజులకు గాను 27 లక్షల షేర్ ని సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 35 లక్షల లోపు షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. తిమ్మరుసు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.6 కోట్లు కాగా 2 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కి మరో 2.04 కోట్ల షేర్ ఇంకా సాధించాలి.
ఇక ఇష్క్ మూవీ 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 35 లక్షల షేర్ ని అందుకోవడం తో మరో 2.35 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంది. తిమ్మరుసు పాజిటివ్ టాక్ వలన ఆదివారం మరింత బాగా హోల్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఇష్క్ సినిమా ఏమైనా గ్రోత్ చూపుతుందో లేదో చూడాలి ఇక.