బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ పడ్డా కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాన్ని ఇప్పుడు సొంతం చేసుకోవడమే కాదు…
తన కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో పాటు టాలీవుడ్ లో టైర్2 హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా…
53 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ షేర్ మార్క్ ని సొంతం చేసుకోవడం విశేషమని చెప్పాలి…
ఒకసారి టాలీవుడ్ లో టైర్2 హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Tollywood Tier2 Hero’s TOP 10 Highest Share Movies
1. #GeethaGovindam – 70.50CR
2. #TilluSquare – 69.00CR
3. #Dasara – 63.55CR
4. #Karthikeya2 – 58.40CR
5. #Thandel – 53.00CR*****
6. #SaripodhaaSanivaaram – 52.65Cr
7. #AAa – 49Cr+
8. #Fidaa – 48.50CR
9. #Virupaksha – 48.50CR
10. #Kushi(2023) – 42.10CR
11. #MCA – 41CR
12. #iSmartShankar – 40.56CR
13. #Majili – 40.23CR
ఓవరాల్ గా టైర్2 హీరోల సినిమాలలో ఎక్కువ షేర్ ని అందుకున్న సినిమాలు ఇవి….ఈ మధ్య టైర్2 హీరోల సినిమాలు తక్కువ అవ్వగా మళ్ళీ ఈ ఏడాది వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో కొత్త సినిమాలు కచ్చితంగా చేరే అవకాశం…
ఎంతైనా ఉందని చెప్పాలి. అదే టైంలో తండేల్ మూవీ ఇక తర్వాత ప్లేస్ లోకి వెళ్ళే అవకాశం తక్కువే కాబట్టి టాప్ 5 ప్లేస్ తోనే నిలిచే అవకాశం ఉండగా అప్ కమింగ్ టైంలో వచ్చే ఏ సినిమాలు గీత గోవిందం రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.