Home న్యూస్ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రివ్యూ…మాస్ రాజా ఊచకోత!

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రివ్యూ…మాస్ రాజా ఊచకోత!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కెరీర్ లో రీసెంట్ టైంలో క్రాక్, ధమాకా లాంటి హిట్స్ పడినా కూడా మద్యలో కొన్ని ఫ్లాఫ్ మూవీస్ నిరాశ పరిచాయి. ఇలాంటి టైం లో తన కెరీర్ లో రీసెంట్ టైం లో మంచి హైప్ ను సొంతం చేసుకున్న సినిమాగా…

టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ముందు నిలుస్తుంది అని చెప్పొచ్చు. పోస్టర్స్, టీసర్ తో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ సినిమా…

రవితేజ కెరీర్ లో అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా ఇప్పుడు నిలిచే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా ఉందని చెప్పాలి ఇప్పుడు. క్వాలిటీ, టేకింగ్, యాక్షన్ ఇలా అన్నీ ట్రైలర్ లో సాలిడ్ గా సెట్ అవ్వగా…

రవితేజ లుక్స్, డైలాగ్స్, హీరోయిజం సీన్స్ అన్నీ బాగున్నాయి… ఒక మామూలు స్టూవర్ట్ పురం దొంగ ఎలా మోస్ట్ వాంటెడ్ ఇండియన్ దొంగగా మారాడు, దానికి కారణం ఏంటి అన్న కాన్సెప్ట్ తో వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ట్రైలర్ వరకు అంచనాలను అందుకుంది…

రిచ్ నెస్ అడుగడుగునా కనిపించిన ఈ ట్రైలర్ ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను పెంచేసే విధంగా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమా కి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here