Home గాసిప్స్ 100 కోట్ల కన్నప్పలో అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!

100 కోట్ల కన్నప్పలో అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!

0

కెరీర్ లో చాలా టైంగా హిట్ కి దూరంగా ఉన్న హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు…..అప్పుడెప్పుడో దేనికైనా రెడీ సినిమాతో మంచి హిట్ అందుకున్న తర్వాత దూసుకెళ్తా సినిమాతో పర్వాలేదు అనిపించగా తర్వాత చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో….

 కన్నప్ప(Kannappa Movie) చేస్తున్న మంచు విష్ణు ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉండగా ఇతర ఇండస్ట్రీల యాక్టర్స్ కూడా సినిమాలో నటిస్తూ ఉండటంతో సినిమా మీద బజ్ పెరుగుతూ వస్తుంది…

రీసెంట్ గా సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పెషల్ రోల్ కోసం ఒప్పించగా ఆ రోల్ తాలుకూ షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారట. 2 వారాల కాల్ షీట్స్ తో అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్ ని కంప్లీట్ చేయగా 2 వారాలకు గాను అక్షయ్ కుమార్ భారీ రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు టాక్ ఉంది…

ఆల్ మోస్ట్ 2 వారాలకు గాను 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ ఉంది…. ఇతర స్టార్స్ కూడా భారీగానే ఉన్న ఈ సినిమా మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తూ ఉండగా తన కెరీర్ లో ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here