బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ కి రిలీజ్ అయిన బిగ్ మూవీ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ, మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలాను అందుకోలేక పోయింది. ఈ క్రమంలో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా…
నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకోగా సినిమా రెండో రోజు ఫ్యామిలీ ఆడియన్స్ అండతో ఏమైనా గ్రోత్ ని చూపెడుతుంది ఏమో అనుకుంటే రెండో రోజు బుక్ మై షోలో సినిమాకి తెగిన టికెట్స్ ఇప్పుడు మైండ్ బ్లాంక్ చేశాయి. అవి రెండో వారంలో 9వ రోజులో ఉన్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie)…
టికెట్ సేల్స్ కన్నా కూడా తక్కువగా ఆన్ లైన్ లో సేల్ అవ్వడం ఇప్పుడు అందరికీ శాకిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు… ది ఫ్యామిలీ స్టార్ మూవీ రెండో రోజు బుక్ మై షోలో మొత్తం మీద 71.46K టికెట్ సేల్స్ మాత్రమే సేల్ అయ్యాయి, అదే టైం లో టిల్లు స్క్వేర్ మూవీ 9వ రోజులో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
76.36K వేల టికెట్ సేల్స్ జరిగాయి, అంటే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో మొత్తం మీద ఫ్యామిలీ స్టార్ కన్నా కూడా టిల్లు స్క్వేర్ మూవీ కి 5 వేలకు పైగా టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగాయి. ఇక ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ లెక్కలు ఇలానే ఉంటే ఆ సినిమా రెండో రోజు కలెక్షన్స్ కన్నా కూడా…
టిల్లు స్క్వేర్ మూవీ 9వ రోజు షేర్ లెక్క ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సమ్మర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఫ్యామిలీ స్టార్ కి ఇలాంటి రెస్పాన్స్ ను అయితే ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి. మంచి రిలీజ్ డేట్ అండ్ హాలిడేస్ దొరికినా కూడా విజయ్ దేవరకొండ బ్యాడ్ లక్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.