కొన్ని కొన్ని సార్లు నెగటివ్ ప్రచారం కూడా కొన్ని సినిమాలకు బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి. ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న బాలీవుడ్ సినిమాలు చాలా ఉన్నాయి, థియేటర్స్ మహారాష్ట్రలో రీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన బాలీవుడ్ వాళ్ళు వచ్చే నెలలో ప్రతీ వారం ఒక సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా…
నవంబర్ నెల ఎండ్ టైం లో ఆడియన్స్ ముందుకు రావడానికి జాన్ అబ్రహం ఏకంగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న సత్యమేవ జయతే 2 సినిమా సిద్ధం అవుతుంది. మొదటి పార్ట్ సక్సెస్ ఫుల్ అవ్వడం తో రెండో పార్ట్ లో యాక్షన్ డోస్ హద్దులకు మించి మరీ…
ఓవర్ ది టాప్ సీన్స్ ని ట్రైలర్ లో పెట్టారు… దాంతో ఆ ట్రైలర్ లో చూసిన ఓవర్ యాక్షన్ సీన్స్ ని చూసి ఆడియన్స్ ఇదేం ట్రైలర్ రా బాబు అంటూ తలలు పట్టుకు కూర్చున్నారు. ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమా లో ఇంకా ఇలాంటి సీన్స్ ఎన్ని ఉంటాయో అని కామెంట్స్ చేశారు…
ఇదంతా ఒకెత్తు అయితే ఈ ట్రైలర్ కి సోషల్ మీడియా లో కూడా రిలీజ్ అయినప్పటి నుండి తెగ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వగా అది ట్రైలర్ కి కలిసి వచ్చి మేకర్స్ అనుకున్న దానికన్నా కూడా సాలిడ్ రీచ్ ట్రైలర్ కి సొంతం అయ్యేలా చేసింది… 24 గంటల్లో ఏకంగా 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని ఈ ట్రైలర్ ఓవరాల్ గా సొంతం చేసుకుంది…
5 లక్షలకు పైగా లైక్స్ కూడా సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 2021 ఇయర్ లో బాలీవుడ్ మూవీస్ పరంగా బెల్ బాటం సినిమా ట్రైలర్ తర్వాత హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన ట్రైలర్ గా నిలిచింది. బెల్ బాటం 23 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అందుకోగా నెగటివ్ పబ్లిసిటీ తో కూడా సెన్సేషనల్ వ్యూస్ ని సొంతం చేసుకుని మంచి రీచ్ ని సాధించింది ఈ సినిమా.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి…