Home న్యూస్ విజయ్ మాస్టర్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

విజయ్ మాస్టర్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఇలయ దళపతి విజయ్ మరియు విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది…వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియా లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుని అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… లారీ యూనియన్ లీడర్ అయిన విలన్ విజయ్ సేతుపతి…జువినైల్ కాలేజ్ లో ఉన్న కుర్రాళ్ళతో తనకి నచ్చిన పనులు చేయిస్తూ ఉంటాడు, మరో కాలేజ్ లో డ్రింకింగ్ అలవాటు ఉన్న హీరో విజయ్ ఒక అనుకోని తప్పు చేయడం తో 3 నెలలకి ఈ జువినైల్ కాలేజ్ కి రావాల్సి వస్తుంది…

తాగుడు అలవాటు ఉన్న స్టూడెంట్స్ ని బాగా చదివించే హీరో ఆ కాలేజ్ కి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు, విలన్ నుండి కాలేజ్ కుర్రాళ్ళని ఎలా కాపాడాడు అన్నది మొత్తం మీద సినిమా అని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ పరంగా విజయ్ తన నటనతో మెప్పించగా…

తన డైలాగ్స్ యాటిట్యూడ్ అండ్ మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తాయి, కానీ సినిమా షో స్టీలర్ మట్టుకు విజయ్ సేతుపతి అని చెప్పాలి. తనలో ఈ రేంజ్ విలనిజం ఉందా అని షాక్ అయ్యే లెవల్ లో విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్అదరగొట్టేశాడు.. ఇక హీరోయిన్ మాళవిక కూడా ఉన్నంతలో మెప్పించగా నటించడానికి పెద్దగా స్కోప్ అయితే లేదని చెప్పాలి.

మిగిలిన రోల్స్ అందరూ పర్వాలేదు అనిపించారు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే… 3 గంటల లెంత్ ఉన్న సినిమా ఎంత ఎడిట్ చేసినా కానీ బోర్ అనిపించడం ఖాయం… ఇక్కడ కూడా అదే జరిగింది. మొదటి అర్ధభాగం అక్కడక్కడా కొంచం స్లో అయినా…

మంచి సీన్స్ పడటం తో టెంపో మెయిన్ టైన్ చేయగా ఇంటర్వెల్ తో పీక్స్ కి వెళుతుంది, సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా తర్వాత సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం అలానే స్టార్ట్ అయినా తర్వాతే గాడి తప్పింది… సెకెండ్ ఆఫ్ ని మరింత బాగా ఎడిట్ చేసి స్క్రీన్ ప్లే రాసుకుని ఉండాల్సింది…

ఇక సంగీతం పరంగా అనిరుద్ కి 100 కి 100 మార్కులు ఇచ్చేయాల్సిందే. పాటలు అద్బుతంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి… మామూలు సీన్స్ కి కూడా అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ తెప్పించాడు అనిరుద్…

సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ లెవల్ లో ఉండగా, తెలుగు డైలాగ్స్, సాంగ్స్ లిరిక్స్ అండ్ సాంగ్స్ విజువల్స్ మరీ అనుకున్న లెవల్ లో అయితే లేవు… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా భారీగా ఉండగా డైరెక్షన్ పరంగా లొకేషన్ కనగరాజ్ చాలా సింపుల్ కథని ఎంచుకుని…

ఖైదీతో మెప్పించినా ఈ సారి మాత్రం అది పెద్దగా వర్కౌట్ అవ్వాలేదు…ఫస్టాఫ్ వరకు తన ట్రిక్కులు వర్కౌట్ అయినా సెకెండ్ ఆఫ్ అవి రిపీటివ్ గా మారి చాలా సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా, డ్రాగ్ అవుతూ రొటీన్ గా మారిపోయాయి. హీరో విలన్ లు నువ్వా నేనా అన్నట్లు తలపడాలని ట్రై చేసినా…

వాటికి సెట్ అయ్యే సీన్స్ ని రాసుకోలేదు… ఇక తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె… తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువ అవ్వడంతో కొంచం బోర్ కొట్టించాయి. ఫస్టాఫ్ వరకు మెప్పించిన లోకేష్ కనగరాజ్ సెకెండ్ ఆఫ్ ను సరిగ్గా డీల్ చేయలేక పోయాడు.. ఎటు తిరిగి అదే కాలేజ్ గొడవలు, హీరో పై విలన్ అటాక్ లు, హీరో కౌంటర్ లతోనే సరిపోయింది సినిమా మొత్తం.

ఇది ఫ్యాన్స్ కి నచ్చే అంశమే అయినా కామన్ ఆడియన్స్ కి ఎక్కే విషయం కాదు… ఉన్నంతలో సినిమా సెకెండ్ ఆఫ్ లో లొసుగులు ఉన్నప్పటికీ కూడా ఈజీగా ఒకసారి హైప్ దృశ్యా చూడొచ్చు. సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here