ఒకప్పుడు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా భారీ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపే తమిళ్ హిరోలలో విక్రం ఒకరు, కానీ తాను రీసెంట్ టైం లో ఎంచుకుంటున్న సినిమాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం తో ఒకటి తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవ్వడం… ప్రేక్షకులను అవి అలరించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచడం, మళ్ళీ కొత్త సినిమాలు రావడం అవి కూడా నిరాశ పరచడం ఇలా సాగుతుంది…
ఈ లిస్టులో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కొత్త సినిమా మిస్టర్ కేకే.. చేరింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏక కాలం లో రిలీజ్ అయ్యింది, సినిమా తమిళ్ లో 20 కోట్ల మేర బిజినెస్ ని సొంతం చేసుకోగా తెలుగు కి వచ్చే సరికి…
మార్కెట్ బాగా తగ్గినా కానీ ఎందుకనో విక్రం మీద చిన్న నమ్మకంతో సినిమాను 2.8 కోట్లకు కొన్నారు. కాగా సినిమా తెలుగు లో 3.6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ రన్ లో ఇక్కడ సినిమా 1.45 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టగలిగింది. ఇక తమిళ్ లో
ఫైనల్ గా 16 కోట్ల గ్రాస్ ని 8.5 కోట్ల మేర షేర్ ని మాత్రమె సినిమా సాధించింది. మొత్తం మీద తమిళ్ లో సినిమాకి 11.5 కోట్ల మేర నష్టం రాగా తెలుగు లో 1.35 కోట్ల మేర లాస్ ని సొంతం చేసుకుని రెండు చోట్లా కూడా డిసాస్టర్ గా మిగిలి పోయింది ఈ సినిమా..
నాసిరకం సినిమాలతో తన మార్కెట్ ని మరింతగా కోల్పోతున్న విక్రం ఇకనైనా మంచి సినిమాలతో కంబ్యాక్ చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు ఆడియన్స్ మాత్రం విక్రం మరో అపరిచితుడు లాంటి సినిమా రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.