రానా దగ్గుబాటి నేనే రాజు నేనే మంత్రి తర్వాత చేసిన సినిమాల్లో అరణ్య ఒకటి, చాలా కాలంగా రూపొందుతున్న ఈ సినిమా ను ఏకంగా 60 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ ఎత్తున రూపొందించారు, సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కే రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన కుదరలేదు. తర్వాత డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ సాలిడ్ గా వచ్చాయి, ఆల్ మోస్ట్ 55 కోట్ల రేంజ్ లో రేటు ఇవ్వడానికి లీడింగ్ కంపనీలు కూడా సై అన్నాయి.
కానీ థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పి ఆ ఆఫర్ కి నో చెప్పగా సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు, దాంతో ఓన్ గానే ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ ఏమి జరగకపోవడం తో…
బడ్జెట్ బిజినెస్ గా మారగా సినిమా 45 కోట్ల రేటు ని అన్ని భాషల నాన్ థియేట్రికల్ రైట్స్ తో సొంతం చేసుకోగా, మిగిలిన 15 కోట్లకు 15.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా డీసెంట్ టాక్ నే సొంతం చేసుకున్నా ఏ దశలో కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది.
టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 99L
👉Ceeded: 46L
👉UA: 50L
👉East: 27L
👉West: 19L
👉Guntur: 38L
👉Krishna: 25L
👉Nellore: 11L
AP-TG Total:- 3.15CR (5.10Cr Gross~)
Ka + Roi: 1.49Cr
OS: 21L
Total World Wide: 4.85CR( 9CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా కలెక్షన్స్.
సినిమా 15.5 కోట్ల టార్గెట్ లో 10.65 కోట్లు నష్టపోయి డబుల్ డిసాస్టర్ గా నిలిచింది, ఇక బడ్జెట్ పరంగా చూసుకుంటే 60 కోట్ల బడ్జెట్ కి 5 కోట్లు కూడా రికవరీ చేయలేక పోయిన సినిమా 55 కోట్లకు పైగా నష్టపోయింది. ఇండియా లో బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అరణ్య సినిమా..