టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా సాధించిన ఓవరాల్ బిజినెస్ 187 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా ముందు గా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ కౌంట్ ని పరిశీలిస్తే…
నైజాం లో సినిమా 430 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక సీడెడ్ లో సినిమా 330 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక ఆంధ్రా మొత్తం మీద 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1210 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, ఇది మరీ రికార్డ్ బ్రేకింగ్ కాదు కానీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ లో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక సినిమా కర్ణాటక లో 340 వరకు థియేటర్స్ లో తమిళ్ లో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
ఇక కేరళలో 130 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న సైరా హిందీ వర్షన్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1600 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. దాంతో టోటల్ గా ఇండియా లో సినిమా 3630 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ 4630 వరకు ఉందని సమాచారం. టాలీవుడ్ తరుపున టాప్ 4 బిగ్గెస్ట్ రిలీజ్ లను గమనిస్తే
#Baahubali2- 8.5k to 9K
#Saaho – 7970
#SyeRaaNarasimhaReddy – 4630*
#Baahubali- 4000
ఈ సినిమాలు టాలీవుడ్ హిస్టరీ లోనే 4 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ ని కన్ఫాం చేసుకున్న సినిమాలు. ఇక సైరా వార్ అండ్ జోకర్ సినిమాల వలన మరీ కొత్త రికార్డులను నమోదు చేయలేదు కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేసే అవకాశం అయితే ఉంది….