Home న్యూస్ ఉగ్రం డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే…రేటు ఎంత పలికిందంటే!

ఉగ్రం డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే…రేటు ఎంత పలికిందంటే!

1

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఉగ్రం బాక్స్ అఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అంచనాలను అయితే అందుకోలేక పోయింది. అల్లరి నరేష్ నుండి జనాలు ఇంత సీరియస్ మూవీని చూడటానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అయినా కానీ తన పెర్ఫార్మెన్స్ కి…

సినిమాలో కొన్ని మాస్ మూమెంట్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా బాక్స్ అఫీస్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. సినిమా డిజిటల్ రైట్స్ ను సాలిడ్ రేటు చెల్లించి దక్కించుకున్న…

Ugram 5 Days Collections Report!

అమెజాన్ ప్రైమ్ వాళ్ళు జూన్ 2 న సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సినిమా టోటల్ నా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 10.50 కోట్ల దాకా పలకగా అందులో డిజిటల్ రైట్స్ కింద సినిమా కి ఆల్ మోస్ట్ 4.2 కోట్ల దాకా…

రేటు సొంతం అయినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. మిగిలిన మొత్తం శాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయినట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా వర్కౌట్ అయి ఉంటే బాగుండేది కానీ ఉన్నంతలో అల్లరి నరేష్ కి కొత్త ఇమేజ్ ను ఈ సినిమా తీసుకువచ్చింది. ఇక డిజిటల్ లో సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Ugram 4 Days Collections Report!

1 COMMENT

Leave a Reply to Maheswari Cancel reply

Please enter your comment!
Please enter your name here