Home న్యూస్ 15 న రిలీజ్ అన్నారు…సినిమా ఆగిపోయింది!!

15 న రిలీజ్ అన్నారు…సినిమా ఆగిపోయింది!!

0

 కరోనా ఎఫెక్ట్ వలన సినిమాలున్ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ డిజిటల్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఇది ఇంకా భారీ లెవల్ కి వెళ్ళలేదు కానీ వేరే భాషల్లో మాత్రం గట్టిగానే ఉంది. ముఖ్యంగా హిందీ లో అయితే ఇది పీక్స్ కి వెళ్ళింది అనే చెప్పాలి. తెలుగు లో చిన్న సినిమాలు మాత్రమే ఇలా డిజిటల్ రిలీజ్ కి ఓకే చెబుతున్నాయి.

అలాంటి వాటిలో బాహుబలి ప్రొడ్యూస్ చేసిన ఆర్కా మీడియా వారి నుండి వస్తున్న ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన మహేశింతే ప్రతీకారం సినిమా తెలుగు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు 5.2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులు సొంతం చేసుకోగా సినిమా ను ఈ నెల 15 న రిలీజ్ చేయబోతున్నాం అంటూ పబ్లిసిటీ కూడా చేశారు కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ ను ఆపేశారు.

కారణాలు ఏంటి అనేవి క్లియర్ గా తెలియకున్నా కానీ ఫైనల్ స్టేజ్ లో ఉన్న కొన్ని చిన్న చిన్న పనుల వల్ల సినిమా రిలీజ్ ను ఆపాల్సి వచ్చింది అనే టాక్ ఉంది. థియేటర్స్ లోనే సినిమా లు ఆగిపోతాయి అని తెలుసు కానీ ఇలా డిజిటల్ రిలీజ్ లకు కూడా అడ్డంకుల వలన రిలీజ్ లు ఆగుతాయని…

అంతా అనుకుంటూ ఉండగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈ నెల ఎండ్ కి రిలీజ్ చేస్తారని టాక్ ఉంది కానీ ఇంకా దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు లో డిజిటల్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో చిన్న సినిమానే అయినా నోటబుల్ మూవీ అంటే ఇదే అవ్వడం తో అందరూ ఆశగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here