ఇది వరకటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇది వరకు సినిమాలు రిలీజ్ అయిన రెండు నెలలలో పరుగు కంప్లీట్ చేసుకున్నాక డిజిటల్ రిలీజ్ జరిగేది, తర్వాత ఛానెల్స్ లో కొంత గ్యాప్ తో టెలికాస్ట్ చేసేవాళ్ళు, ఈ లోపు లోకల్ ఛానెల్స్ ఆ సినిమాలను పలుసార్లు టెలికాస్ట్ చేసుకునే వారు కానీ ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం లేదు.
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న వేల సినిమాల శాటిలైట్ రైట్స్ ని కోట్ల రేటు చెల్లించి దక్కించుకున్న ఛానెల్స్ కన్నా ముందే లోకల్ ఛానెల్స్ సినిమా ప్రింట్ వచ్చిన రోజునే టెలికాస్ట్ చేస్తున్నారు. ఏవో మరీ చిన్న చితకా సినిమాలకు అంటే ఏమో అనుకునేవారు కావొచ్చు…
కానీ నోటబుల్ మూవీస్ కి కూడా ఇదే చేయడం తో ఛానెల్స్ కి మండిపోతుంది, రీసెంట్ గా నాని సుధీర్ బాబు ల వి ది మూవీ ని ఇలానే చేయగా ఛానెల్ కి కోపం వచ్చి లోకల్ ఛానెల్ కి 2.5 కోట్ల ఫైన్ కట్టండి అంటూ నోటిసులు పంపింది. దాంతో లోకల్ ఛానెల్…
దాంతో షాక్ అయిన లోకల్ ఛానెల్ ఆ ఫైన్ రేటు చూసి షాక్ అయ్యి ఛానెల్ ని బ్రతిమలాడుకుని తప్పైంది అంటూ వేడుకుని ఫైన్ కింద 50 లక్షల రేటు చెల్లించారాని సమాచారం. ఇంకోసారి ఇలాంటివి చేయం మమ్మల్ని క్షమించండి అంటూ రిక్వెస్ట్ లు చేయగా ఛానెల్ ఫస్ట్ వార్నింగ్ కింద వదిలేస్తున్నాం అంటూ వార్నింగ్ ఇచ్చి…
వదిలేశారని సమాచారం. ఇలా నోటిసు పంపాక ఎంత ఫైన్ అంటే అంత కట్టాలి, కానీ ఛానెల్స్ ఇలా తగ్గడం వల్ల లోకల్ ఛానెల్స్ మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయితే మళ్ళీ ఇదే రూట్ ఫాలో అవుతున్నాయి. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య విషయం లో ఇదే జరగగా ఇప్పుడు వి విషయం లో కూడా ఇదే జరిగింది.