Home Uncategorized రికార్డ్ రేటు…సరిపోదు అన్నారు…ప్లాబ్ బి తో రిస్క్ చేయనున్న రంగ్ దే!

రికార్డ్ రేటు…సరిపోదు అన్నారు…ప్లాబ్ బి తో రిస్క్ చేయనున్న రంగ్ దే!

690
0

రీసెంట్ టైం లో ఏ సినిమా కి లేని బంపర్ ఆఫర్ యూత్ స్టార్ నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో రూపొందిన లవ్ స్టొరీ రంగ్ దే సినిమా కి దక్కింది. కానీ అదే సమయం లో సినిమా పై పలు రకాల వాదనలు రూమర్స్ ఇండస్ట్రీ లో గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి వాటిని గమనిస్తే… ఈ సినిమా ముందు సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు కానీ తర్వాత…

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఓకే చెప్పారు…. కానీ రేటు మాత్రం భారీగా డిమాండ్ చేయగా ఆ రేటు కి ఆల్ మోస్ట్ క్లోజ్ గా వచ్చే రేటు ని ఆఫర్ చేశాయి రెండు OTT యాప్స్… కానీ డిమాండ్ చేసిన రేటు కావాలని యూనిట్ అంటూ ఉండటం తో కొత్త రూల్ తో..

సినిమాను రిలీజ్ చేసే ఆలోచన లో ఉన్నారు ఇప్పుడు… సినిమా ను డైరెక్ట్ రిలీజ్ కోసం 40 కోట్ల మేర డిమాండ్ చేయగా జీ 5 మరియు అమెజాన్ ప్రైమ్ 38 – 38.2 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కానీ యూనిట్ 40 కావాల్సిందే అనడం తో…

పే పెర్ వ్యూ పద్దతి తో సినిమాను రిలీజ్ చేద్దాం అన్న ప్రపోజల్ పెట్టారట. అంటే టికెట్ కొని సినిమా OTT లో చూడాలి అన్న మాట. టికెట్ రేటు యావరేజ్ గా 120 పెడితే ఓ 10 లక్షల మంది ఆ టికెట్ కొని చూస్తె 12 కోట్లు వస్తాయి. అలా లాంగ్ రన్ లో ఎంతైనా రావచ్చు. కానీ అదే సమయం లో మాస్టర్ ప్రింట్ మొదటి గంటకే బయటికి వస్తుంది కాబట్టి… టికెట్లు తక్కువ కొనే అవకాశం ఉంది, ఈ అమౌంట్ లో కూడా 70% మూవీ యూనిట్ కి 30% OTT యాప్ ఉంచుకుంటుంది అని టాక్.

కానీ బిగ్ రిస్క్ తో కూడుకున్న పని ఇది. కానీ రంగ్ దే టీం ఇప్పుడు ప్లాన్ బి కి వెళ్ళే ఆలోచనలో ఎక్కువగా ఉందని ట్రేడ్ టాక్. కానీ కొంచం రేటు తగ్గినా 38.2 కోట్ల రేటు టాలీవుడ్ లో ఇప్పుడు కన్ఫాం అయితే హైయెస్ట్ రేటు… ఆ రేటు కి ఓకే చెప్పడం చాలా బెటర్ అండ్ రిస్క్ ఫ్రీ అని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా యూనిట్ ఏం డిసైడ్ అవుతుంది అన్నది మాత్రం ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here