కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ వర్షన్ బిజినెస్ అండ్ థియేటర్స్ లెక్కలు లాంటివి ఇంకా బయటికి రావాల్సి ఉండగా తెలుగు వెర్షన్ ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్కలు 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా తెలుగు లో క్లీన్ హిట్….
అవ్వాలి అంటే సినిమా మొత్తం మీద 2.7 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా కి ఒక్క రోజు గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ అవుతూ ఉండగా ఒక్క రోజులోనే సినిమా ఎంత కుదిరితే అంత….
వెనక్కి రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా నైజాంలో 154 థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా సీడెడ్ లో 75 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా ఆంధ్ర రీజన్ లో 235 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక టోటల్ గా తెలుగు రాష్ట్రలలో సినిమా ఇప్పుడు మొత్తం మీద….
465 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అయ్యి మూడు రోజులు దాకా అవుతూ ఉండగా మల్టీ ప్లెక్సులలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా మాస్ సెంటర్స్ లో అండ్ సింగిల్ స్క్రీన్స్ లో బిలో యావరేజ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ….
దూసుకు పోతే కలెక్షన్స్ ఇంప్రూవ్ మెంట్ ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి 30-40 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, అన్ని చోట్లా బుకింగ్స్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ పొతే 50-60 లక్షల దాకా వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఇక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…