Home న్యూస్ వీరయ్య వీర విహారానికి డేట్ కన్ఫాం….ఇక రచ్చ రచ్చే!!

వీరయ్య వీర విహారానికి డేట్ కన్ఫాం….ఇక రచ్చ రచ్చే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య, బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో మాస్ మహారాజ్ రవితేజ కనిపించబోతుండగా సినిమా సంక్రాంతి బరిలో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీకి ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం కూడా…

సినిమా పైన ఆడియన్స్ లో మంచి అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. ఇక సంక్రాంతి రేసులో ఈ సినిమా రిలీజ్ అవుతున్న రిలీజ్ డేట్ ను ఇప్పుడు అఫీషియల్ గా మేకర్స్ కన్ఫాం చేశారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా…

భారీ ఎత్తున జనవరి 13న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని సమాచారం. జనవరి 12న బాలయ్య వీర సింహా రెడ్డి రిలీజ్ కానుండగా జనవరి 13న ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానుంది.

మొదటి రోజు మాత్రం సినిమా కి భారీ లెవల్ లో థియేటర్స్ సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. అసలే బాక్ టు బాక్ ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో ఈ సినిమా పై ప్రెజర్ కొంచం ఎక్కువే ఉన్నా సంక్రాంతి అడ్వాంటేజ్ తో దుమ్ము లేపే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here