బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కి దూరం అయిన హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను… ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్న నాగశౌర్య కచ్చితంగా ఛలో తర్వాత మళ్ళీ అలాంటి హిట్ ను సొంతం చేసుకుంటాను అన్న నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. దసరా సీజన్ అయిపోయాక బరిలో నిలిచిన వరుడు కావలెను సినిమా కి….
ఆడియన్స్ నుండి డీసెంట్ గా ఉంది, ఫ్యామిలీస్ కి నచ్చుతుంది అన్న టాక్ ని అయితే సొంతం చేసుకుంది కానీ రిలీజ్ టైం కి సీజన్ అయిపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపెట్టలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా మరోసారి నాగశౌర్య కి ఈ సినిమా…
నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం అయ్యేలా చేసింది. సినిమా 9 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ కి టోటల్ రన్ లో 5.2 కోట్లు మాత్రమే రికవరీ చేసి 3.8 కోట్ల లాస్ తో డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా జీ 5 వాళ్ళు డిజిటల్ రైట్స్ ను మంచి రేటు…
చెల్లించి సొంతం చేసుకోగా సినిమా డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ మాత్రం వ్యూవర్ షిప్ పరంగా దుమ్ము దుమారం లేపే రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకుని జీ 5 యాప్ లో బిగ్గెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిందంట. కేవలం 3 రోజుల టైం కే ఏకంగా 50 మిలియన్ కి పైగా…
1 మినట్ వాట్చ్ టైం ని సొంతం చేసుకుని వాళ్ళ యాప్ లో తక్కువ టైం 50 మిలియన్ మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ లో వ్యూవర్ షిప్ అంటే సినిమా డిజిటల్ లో సూపర్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ వీక్ వ్యూవర్ షిప్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.