Home న్యూస్ వరుడు కావలెను టోటల్ బిజినెస్, థియేటర్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

వరుడు కావలెను టోటల్ బిజినెస్, థియేటర్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వరుడు కావలెను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని మంచి టాక్ నే అక్కడ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయ్యింది, సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ అండ్ థియేటర్స్ కౌంట్ లెక్కలు బయటికి వచ్చాయి.

ముందుగా సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే… సినిమా కి ఆంధ్ర రీజన్ లో 2.5 కోట్ల బిజినెస్ జరగగా సీడెడ్ ఏరియాలో 2 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో 3.5 కోట్ల బిజినెస్ జరగగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 8 కోట్ల మేర…

ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.6 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 9 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…

ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాం లో 156 థియేటర్స్ లో సీడెడ్ లో 70 థియేటర్స్ లో ఆంధ్ర రీజన్ లో 180 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ రోజున మరో 20-30 థియేటర్స్ పెంచుకునే అవకాశం ఉండగా…

టోటల్ వరల్డ్ వైడ్ గా 630 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఓవరాల్ గా సినిమా 9 కోట్ల టార్గెట్ తో 630 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఎంతవరకు బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here