Home గాసిప్స్ సెన్సేషనల్ కాంబినేషన్ లో వరుణ్ తేజ్ న్యూ మూవీ!!

సెన్సేషనల్ కాంబినేషన్ లో వరుణ్ తేజ్ న్యూ మూవీ!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో యమ జోరు మీదున్నాడు, ఫిదా ముందు వరకు ఒక్క నికార్సయిన హిట్ కోసం ఎదురు చూడగా, ఫిదా తో ఆ సెన్సేషనల్ హిట్ దొరకగా తర్వాత ఇక వెను తిరిగి చూడకుండా దూసుకు పోతున్నాడు వరుణ్ తేజ్, తొలిప్రేమ, గద్దల కొండ గణేష్ లాంటి సోలో హిట్స్ తో పాటు ఎఫ్ 2 లాంటి మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ తో కూడా దుమ్ము లేపాడు.
86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్

ఇక ఇప్పుడు బాక్సింగ్ నేపధ్యం లో తన అప్ కమింగ్ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కి సాలిడ్ గా ప్లాన్ చేశాడు అని చెప్పొచ్చు. స్టైలిష్ టేకింగ్ తో దుమ్ము లేపే దర్శకుడు సురేందర్ రెడ్డి తో తన అప్ కమింగ్ మూవీ చేయబోతున్నాడు.
రామ్ చరణ్ సంచలన నిర్ణయం…మరో బ్లాక్ బస్టర్ రీమేక్ కి సై??

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో సైరా లాంటి పాన్ ఇండియా మూవీ తీశాడు సురేందర్ రెడ్డి, ఇక ఈ సినిమా కి కథ ని వక్కంతం వంశీ అందించబోతున్నారట. వీరి కాంబినేషన్ లో ఇది వరకు కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన విషయం తెలిసిందే.
వరుణ్ తేజ్ మూవీ లో కన్నడ స్టార్ హీరో!!

ఇక ఈ సినిమా ను డైరెక్టర్ క్రిష్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఓవరాల్ గా కథ, డైరెక్షన్, నిర్మాణం అన్నీ సాలిడ్ గా ప్లాన్ చేసుకున్న ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి సాలిడ్ గా వర్కౌట్ అయితే వరుణ్ తేజ్ కెరీర్ రేంజ్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…
గద్దలకొండ గణేష్ TRP రేటింగ్: అమ్మింది 7 కోట్లకు…వచ్చిన TRP రేటింగ్ ఇది!!

కెరీర్ పీక్ స్టేజ్ కి చేరుకునే ఫాం ని అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత ఎఫ్ 3 లో నటించ బోతున్న విషయం తెలిసిందే. మొత్తం మీద 3 అప్ కమింగ్ మూవీస్ లో 2 బాగా వర్కౌట్ అయినా టైర్ 2 హీరోల్లో తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
వరుణ్ తేజ్ మాస్…3 కోట్ల నుండి 10 కోట్లు…టాలీవుడ్ షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here